close
Choose your channels

అమల అక్కినేని చేతుల మీదుగా నాగ్ ఊపిరి ఆడియో విడుదల

Tuesday, March 1, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ కింగ్ నాగార్జున - కోలీవుడ్ హీరో కార్తీ - మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా కాంబినేష‌న్లో రూపొందిన భారీ క్రేజీ మూవీ ఊపిరి. ఈ చిత్రాన్ని వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కించారు. తెలుగు, త‌మిళ్ లో రూపొందుతున్న ఈ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ మూవీని పి.వి.పి సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించింది. గోపీ సుంద‌ర్ సంగీతాన్ని అందించిన ఊపిరి చిత్రం ఆడియో ఆవిష్క‌ర‌ణోత్స‌వం హైద‌రాబాద్ నోవాటెల్ లో సినీప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రిగింది. ఊపిరి ఆడియోను శ్రీమ‌తి అమ‌ల అక్కినేని ఆవిష్క‌రించారు.
ఈ సంధ‌ర్భంగా ...
క‌ళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ...ఊపిరి సినిమాలో ఫ‌స్ట్ సాంగ్ చాలా బాగుంది. ఒక స్టార్ హీరో కెరీర్ బిగినింగ్ లో క్యాన్సిర్ పేషెంట్ గా చేయ‌డం అంటే మామూలు విష‌యం కాదు. కొత్త‌గా ఆలోచించారు అందుకే గీతాంజ‌లి సినిమా వ‌చ్చింది. అలాగే నిన్నేపెళ్లాడ‌తా త‌ర్వాత అన్న‌మ‌య్య సినిమా చేయ‌డం అనేది ఎవ‌రూ ఊహించ‌రు. అలా చేసారు కాబ‌ట్టే అన్న‌మ‌య్య అనే గొప్ప సినిమా వ‌చ్చింది. స్టార్ హీరో యాక్సిడెంట్ లో చ‌నిపోతాడు అంటే ఒప్ప‌కోరు కానీ నాగ్ సార్ అలా చేసారు కాబ‌ట్టే సోగ్గాడే చిన్ని నాయ‌నా వ‌చ్చింది. ఇప్పుడు వీల్ ఛైర్ లో ఉండే క్యారెక్ట‌ర్ చేయ‌డం అంటే ఓ సాహ‌సం. నాగ్ సార్ చేసిన ఊపిరి గొప్ప సినిమా అవుతుంది. పి.వి.పి సంస్థ బ్ర‌హ్మోత్స‌వం, ఊపిరి లాంటి భారీ చిత్రాల‌ను నిర్మిస్తూ త‌క్కువ బ‌డ్జెట్ లో క్ష‌ణం అనే కొత్త‌ సినిమా నిర్మించారు. ఈ సినిమా కొత్త‌గా ఉంటుంది అనుకుంటున్నాను. ఇద్ద‌రు స్టార్ హీరోల‌తో వంశీ పైడిప‌ల్లి యాక్ష‌న్ ఫిలిం చేస్తున్నారు అనుకున్నాను. కానీ ఇంత కొత్త‌గా ఉంటుంది అనుకోలేదు. గోపీ సుంద‌ర్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం టీమ్ అంద‌రికీ ఆల్ ద బెస్ట్ అన్నారు.
రాఘ‌వేంద్ర‌రావు మాట్లాడుతూ....గోపీ సుంద‌ర్ భ‌లే భ‌లే మ‌గాడివోయ్ కి చాలా మంచి మ్యూజిక్ అందించాడు. సినిమాకి భాష లేదు. అలా ఎందుకు అన్నానంటే నాగార్జున గీతాంజ‌లి చేస్తే త‌మిళ్ లో పెద్ద హిట్ అయ్యింది. వంశీ చాలా మంచి క‌థ‌ను ఎంచుకున్నాడు. ఊపిరి తెలుగు, త‌మిళ్, మ‌ల‌యాళంలో హిట్ అవ్వాల‌ని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అన్నారు.
నిర్మాత అశ్వ‌నీద‌త్ మాట్లాడుతూ... నా అభిమాన హీరో నాగార్జ‌న గారు... హ్యాట్రిక్ కొట్ట‌బోతున్నారు. ఈ ఐదు ఏళ్ల‌లో సౌతిండియాకే సెన్సేష‌న్ పి.వి.పి. వంశీ పైడిప‌ల్లి స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్. ఈ సాంగ్స్ చూస్తుంటే నాగార్జున గార్కి హ్యాట్రిక్ ఖాయం అనిపిస్తుంది అన్నారు.
ర‌చ‌యిత హ‌రి మాట్లాడుతూ...కొత్త ఆలోచ‌నతో క‌థ రాసిన‌ప్పుడు హీరో ఒప్పుకుంటారా..? నిర్మాత ఒప్పుకుంటాడా..? అనే స్ధాయిలో ఆగిపోతుంటుంది. అప్పుడ‌ప్పుడు నాగార్జున గారి గీతాంజ‌లి, రామ్ గోపాల్ వ‌ర్మ గారి శివ గుర్తుకువ‌స్తుంది. అప్పుడు ఏదైనా కొత్త‌గా క‌థ రాయ‌లి అనిపిస్తుంది. ఇక ఈ సినిమా విష‌యానికి వ‌స్తే... హీరోని వీల్ ఛైర్ లో కూర్చొబెట్టి ఊహించ‌గ‌ల‌మా అనిపిస్తుంటుంది. తెలుగులో ఇలాంటి సినిమా వ‌స్తుందా..? అనిపించింది. అలాంటిది నాగార్జున గారు చేసి చూపించారు. నాగార్జున గార్ని క‌ల‌వ‌గానో ఎంతైతే ప్రొత్స‌హించారో..ఈ రోజు వ‌ర‌కు అదే స్పిరిట్ అందించారు. 30 ఏళ్లుగా ఉంటూ ఎన్నో ప్ర‌యోగాలు చేసిన నాగార్జ‌న‌ గారితో వ‌ర్క్ చేయ‌డం చాలా చాలా సంతోషంగా ఉంది. ఇక కార్తీ గారి గురించి చెప్పాలంటే...ఇది రెగ్యుల‌ర్ సినిమా కాదు యాక్ష‌న్ సినిమా అంత‌క‌న్నా కాదు. ఇలాంటి సినిమా చేస్తారా అన‌గానే క‌థ న‌చ్చితే చేస్తాను రండి అన్నారు. 10 నిమిషాల్లో క‌థ విని ఓకె చెప్పారు. అలాగే పి.వి.పి గారు ఎంత‌గానో ప్రొత్స‌హించారు. ఇలాంటి మంచి మ‌నుషుల మ‌ధ్య‌లో ఈ సినిమా రూపొందింది అన్నారు.
హీరోయిన్ త‌మ‌న్నా మాట్లాడుతూ...సినిమా షూటింగ్ లో బిజీగా ఉండ‌డం వ‌ల‌న ఆడియో ఫంక్ష‌న్ కి రాలేక‌పోయాను. ఈ సినిమా నాకు చాలా చాలా స్పెష‌ల్. ఈ సినిమాలో న‌టించినందుకు చాలా గ‌ర్వంగా ఉంది. ఈ సినిమాలో న‌టించే అవ‌కాశం క‌ల్పించినందుకు పివిపి గార్కి థ్యాంక్స్. ఇలాంటి సినిమాకి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాకి గోపీసుంద‌ర్ మ్యూజిక్ అనేది ఒక క్యారెక్ట‌ర్ లాంటిది. అన్నారు.
డైరెక్ట‌ర్ హారీష్ శంక‌ర్ మాట్లాడుతూ...ఒక‌సారి పి.వి.పి గారు మంచి సినిమా చేద్దాం అన్నారు. ఆరోజు మంచి సినిమా అంటే ఏమిటో ఈరోజు అర్ధం అయ్యింది. వంశీ నేను ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేసాం. వంశీ ఊపిరి సినిమా చేస్తున్నాను అన‌గానే ఇది నీ టైపు సినిమా కాదే అనుకున్నాను. ఈ సినిమాకి నాగ్ సారే ఊపిరి. నాగ్ సార్, కార్తీ లాంటి పెద్ద హీరోలు దొరికితే నేను మాస్ సినిమా చేస్తాను. కానీ వంశీ చాలా మంచి సినిమా చేసాడు అన్నారు.
సుమంత్ మాట్లాడుతూ.... క్ష‌ణం సినిమా చూసాను. పి.వి.పి టైమ్ స్టార్ట్ అయ్యింది. ఇటీవల రెస్టారెంట్ కి వెళ్లిన‌ప్పుడు ఒక అమ్మాయిని చూసి న‌వ్వాను. ఆ అమ్మాయి నా ద‌గ్గ‌రికి వ‌చ్చి ఎందుకు న‌న్ను చూసి న‌వ్వుతున్నారు అని అడిగింది. అప్పుడు ఏం చెప్పాలో తెలియ‌క ఊపిరి సినిమాలో డైలాగ్ అందాన్ని ఆస్వాదించాలి... అని చెప్పాను. సినిమా రిలీజ్ త‌ర్వాత అంద‌రూ ఈ డైలాగే చెబుతారు అన్నారు.
గీత ర‌చ‌యిత రామ‌జోగ‌య్య‌శాస్త్రి మాట్లాడుతూ ...పి.వి.పి గార్కి ఈ సినిమా మ‌రో గొప్ప సినిమా అవుతుంది. ఊపిరి మంచిపేరుతో పాటు మంచి క‌లెక్ష‌న్స్ సాధించే సినిమా అవుతుంది. తెలుగు ప్రేక్ష‌కులు అంద‌రూ కొత్త‌ది రాలేదు రాలేదు అంటారు. వ‌చ్చిన‌ప్పుడు మ‌నమంద‌రం ఆద‌రించాలి. గోపీ సుంద‌ర్ మ్యూజిక్ మ‌న‌వాడే మ‌న మ్యూజిక్ అనేలా ఉంటుంది. నువ్వేమిచ్చావ్ అనే పాట వింటేనే క‌న్నీళ్లు వ‌చ్చాయి. సినిమాలో చూస్తే త‌ట్టుకోలేం అనిపిస్తుంది. గోపీ సుంద‌ర్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్ల‌స్ అవుతుంది. మంచి ఆల్బ‌మ్ కుదిరింది. ఇలాంటి ఆల్బ‌మ్ లో నేను భాగం అయినందుకు ఆనందంగా ఉంది అన్నారు.
ర‌చ‌యిత అబ్బూరి ర‌వి మాట్లాడుతూ....నాగ్ సార్ తో నేను చేసిన ఫ‌స్ట్ సినిమా డాన్ సెకండ్ సినిమా ఊపిరి. అలాగే వంశీ పైడిప‌ల్లితో నేను చేసిన ఫ‌స్ట్ ఫిలిమ్ ఎవ‌డు, సెకండ్ ఫిలిమ్ ఊపిరి. ఈ సినిమాకి సీతారామ‌శాస్త్రి గారు పాట‌లు రాసినంత కాలం ఆయ‌న ఓ త‌ప‌స్సు చేస్తుంటే చూసే అవ‌కాశం వంశీ నాకు ఇచ్చాడు. ఈ సినిమాకి సంబంధించిన ప్ర‌తి పాట చాలా అద్భుతంగా వ‌చ్చింది. గొప్ప మ్యూజిక్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ . ప్ర‌తి క్ష‌ణం నన్ను ప్రొత్స‌హించిన వంశీ పైడిప‌ల్లికి థ్యాంక్స్ అన్నారు.
ర‌ఘ‌రామ‌రాజు మాట్లాడుతూ...తెలుగు వారంద‌రికీ సంక్రాంతి తీసుకువ‌చ్చిన సోగ్గాడు నాగార్జున ఊపిరితో స‌మ్మ‌ర్ ని తీసుకువ‌స్తారు. స‌మ్మ‌ర్ లో ఫ‌స్ట్ బిగ్ హిట్ ఊపిరి అవుతుంది అన్నారు.
జ‌య‌సుధ మాట్లాడుతూ...ఊపిరి సినిమాలో నేను కూడా న‌టించాను. వంశీ పైడిప‌ల్లి డైరెక్ష‌న్లో ఎవ‌డు సినిమాలో న‌టించాను. ఇందులో చాలా సింపుల్ రోల్ చేసాను. నాగార్జున గారి కెరీర్ బెస్ట్ ఫిలిమ్స్ లో ఊపిరి ఒక బెస్ట్ ఫిలిమ్ అవుతుంది. నేను నాగార్జున గారి ఫ్యాన్ కూడా. కార్తీ చాలా నేచుర‌ల్ గా న‌టిస్తాడు. కార్తీ న‌టిస్తుంటే అలా చూస్తుండిపోయాను. పి.వి.పి సంస్థ‌లో బ్ర‌హ్మోత్స‌వం లో న‌టిస్తున్నాను. ఈ సంస్థ‌లో న‌టిస్తున్న రెండో సినిమా ఇది. ఈ సినిమా పెద్ద స‌క్సెస్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను. నా ఊపిరి నా ఇద్ద‌రి పిల్ల‌లు అన్నారు.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ...మున్నా, బృందావ‌నం, ఎవ‌డు...ఈ మూడు చిత్రాల‌ను మా సంస్థ‌లో చేసిన వంశీ ఇప్పుడు ఊపిరి సినిమాతో తమిళ్ లో ఎంట‌ర్ అవుతుండ‌డం సంతోషంగా ఉంది. త‌మిళ్ లో కూడా వంశీ మంచి పేరు తెచ్చుకోవాల‌ని కోరుకుంటున్నాను. పివిపి మంచి సినిమాలు తీస్తున్నారు. విజువ‌ల్స్ చూస్తుంటే ఖ‌ర్చుకు వెన‌కాడ‌కుండా తీస్తున్నార‌నే విష‌యం తెలుస్తుంది. గోపీ సుంద‌ర్ పెంటాస్టిక్ మ్యూజిక్ అందించారు. 1980లో కెరీర్ ప్రారంభించిన సీనియ‌ర్ హీరోలు ఎవ‌రూ సాధించ‌లేని 50 కోట్ల మార్క్ ను బంగార్రాజు నాగార్జున గారు సాధించారు. 1989లో గీతాంజ‌లి, శివ చిత్రాలు ఎలా అయితే ట్రెండ్ సెట్ అయ్యాయో... ఈ సంవత్స‌రం కూడా సోగ్గాడే చిన్ని నాయ‌నా, ఊపిరి ఈ రెండు ట్రెండ్ సెట్ అవుతాయి. స‌మ్మ‌ర్ ఫ‌స్ట్ బిగ్గెస్ట్ హిట్ ఊపిరి అవుతుంది అన్నారు.
క్ష‌ణం డైరెక్ట‌ర్ ర‌వికాంత్ మాట్లాడుతూ...గోపీ సుంద‌ర్ గ్రేట్ మ్యూజిక్ అందించారు. ఊపిరి స్టోరీ తెలుసు. పి.వి.పి గారు ఇలానే మంచి సినిమాలు తీస్తార‌ని ఆశిస్తున్నాను అన్నారు.
కాజ‌ల్ మాట్లాడుతూ...త‌మ‌న్నా నాకు చాలా మంచి ఫ్రెండ్. మేమిద్ద‌రం ఒకేసారి కెరీర్ స్టార్ చేసాం. నేను నాగార్జున గారికి పెద్ద ఫ్యాన్. నాగ్ సార్ చాలా ఛాలెంజింగ్ రోల్ చేసారు. ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.
ద‌శ‌ర‌థ్ మాట్లాడుతూ...వంశీ చాలా అదృష్ట‌వంతుడు. ఇంత గొప్ప సినిమా చేయ‌డం చూస్తుంటే అసూయ‌గా ఉంది. నాగార్జ‌న గారు ఉంటేనే ఇలాంటి మంచి సినిమాలు వ‌స్తాయి. నేను కూడా నాగార్జున గారి ఫ్యాన్ ని. నా పేరు శివ సినిమా చూసిన‌ప్ప‌టి నుంచి కార్తీ గారి సినిమాల‌ను ఫాలో అవుతున్నాను. ఊపిరి సూప‌ర్ హిట్ అవ్వాలి అన్నారు.
ఆలీ మాట్లాడుతూ...వంశీ ద‌గ్గ‌ర ఇంత గొప్ప ద‌ర్శ‌కుడు ఉన్నాడ‌ని తెలిసి చాలా ఆనందం వేసింది. ఈ సినిమా చాలా డిఫ‌రెంట్. కామెడీ ఎంజాయ్ చేస్తారు. సెంటిమెంట్ ఎంజాయ్ చేస్తారు. క‌థ‌ను ఎన్నుకున్న అంద‌ర‌కీ ఆల్ ద బెస్ట్. నా ఊపిరి సినిమా. ఇంత అద్భుత‌మైన సినిమాలో అవ‌కాశం క‌ల్పించినందుకు ధ్యాంక్స్. అన్న‌మ‌య్య‌, శ్రీరామ‌దాసు, సోగ్గాడు...ఇలా డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్ పండించాలంటే నాగార్జున గారికే సాధ్యం అన్నారు.
వంశీ పైడిప‌ల్లి మాట్లాడుతూ...ఊపిరి రెండు సంవ‌త్స‌రాల జ‌ర్నీ. దీనికి కార‌ణం ముగ్గురు నాగార్జున గారు కార్తీ, పి.వి.పి.నేను ఏమిచ్చిరుణం తీర్చుకోగ‌ల‌నో తెలియ‌దు. నాగార్జున గార్కి నేను చెప్ప‌గానే నేను చేసేస్తున్నాను అన్నారు. నా మీద పెట్టిన న‌మ్మ‌కానికే భ‌య‌ప‌డ్డాను. నేను ప్యారీస్ షూటింగ్ టైమ్ లో నాలో కొంత నిరుత్సాహాన్నిగ‌మ‌నించి మీరిచ్చిన సపోర్ట్ ని మ‌ర‌చిపోలేను. ఈ సినిమాకి ఇంకో ఊపిరి కార్తీ సార్. ఆయ‌న గురించి చెబితే ఇప్ప‌డు ఆగాదు అలా చెబుతూనే ఉంటాను. కార్తీ సార్ క‌థ విని ఒకే చెప్పిన రోజును మ‌ర‌చిపోలేను. ఆయ‌నకి ద‌ర్శ‌కుడి బాథ‌లు తెలుసు కాబ‌ట్టి ఈ సినిమాకి ఒక‌ అసిస్టెంట్ డైరెక్ట‌ర్లా వ‌ర్క్ చేసారు. ఈ సినిమాకి నాగ్ సార్, కార్తీ క‌ల‌సిన విధానం మాట‌ల్లో చెప్ప‌లేను. పి.వి.పి న‌న్ను ఒక త‌మ్ముడులా చూసుకున్నారు. అబ్బూరి ర‌వి, హ‌రి, సాల్మ‌న్ ఎంతో స‌హ‌క‌రించారు. నేష‌న‌ల్ విన్న‌ర్ గోపీ సుంద‌ర్ చాలా మంచి మ్యూజిక్ అందించారు. ప్ర‌కాష్ రాజ్, జ‌య‌సుథ‌గారు, త‌మ‌న్నా...ఇలా ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ అంద‌ర‌కీ థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను అన్నారు.
పి.వి.పి మాట్లాడుతూ...ఊపిరి సినిమా నిర్మించినందుకు గ‌ర్వంగా ఉంది. కార్తీకి తెలుగు ఇండ‌స్ట్రీ త‌రుపున స్వాగ‌తం చెబుతున్నాను అన్నారు.
నాగార్జున మాట్లాడుతూ...మొన్నం మ‌నం,మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు, సోగ్గాడు...ఎంతో ప్రేమ చూపించారు. అభిమానులంద‌రూ నా ఊపిరి. పెద్ద‌బ్బాయి చైత‌న్య సినిమా టైటిల్ సాహ‌స‌మే శ్వాస‌గా సాగిపో ఎప్ప‌టి నుంచో న‌చ్చింది. సాహ‌సంతోనే గీతాంజ‌లి చేసాను. శివ చేసాను.నిన్నే పెళ్లాడ‌తా చేసాను అన్న‌మయ్య చేసాను. ఊపిరి పెద్ద జ‌ర్నీ అయిపోయింది. ఈ సినిమా ఓరిజిన‌ల్ నాకు, అమ‌ల‌కి బాగా న‌చ్చింది . తెలుగులో ఎవ‌రైనా చేస్తే బాగుంటుంది అనుకున్నాను. వంశీ వ‌చ్చి మీరు చేస్తే బాగుంటుంది అన‌గానే వెంట‌నే చేసేస్తాను అన్నాను. వీల్ ఛైర్ లో కూర్చొన్నాను అనుకోవ‌ద్దు మ‌న‌సు ప‌రుగుపెడుతుంటుంది. న‌వ్విస్తాం..ప్యారీస్ చూపిస్తాం. ప్ర‌పంచాన్ని చూపిస్తాం. మ‌నిషికి ఒక తోడు కావాలి. డ‌బ్బులు ఎతైనా ఉండ‌చ్చు తోడు లేక‌పోతే ఏం చేస్తాం. మ‌నిషికి ఒక తోడు ఎంత అవ‌స‌రం అదే ఊపిరి సారాంశం. తోడు అంటే ఒంట‌రిత‌నం అనేదే ఉండ‌దు. నాకు ఈ సినిమాలో తోడు కార్తీ. .కార్తీ గుడ్ ఫ్రెండ్. ఈ సినిమాతో నాకు ఒక త‌మ్మ‌డు దొరికాడు. త‌మిళ‌నాడులో సూర్య‌, కార్తీ న‌న్ను ఎంత బాగానో రిసీవ్ చేసుకున్నారు. ఈ సినిమాకి ఇంకో ఊపిరి పి.వి.పి. గోపీ సుంద‌ర్ బ్యూటీఫుల్ సాంగ్స్ ఇచ్చాడు. ప్ర‌కాష్ రాజ్ నేను ఫ్రెండ్స్ గా న‌టించాం. ఊపిరి ఖ‌చ్చితంగా విజ‌యం సాధిస్తుంది అన్నారు.
కార్తీ మాట్లాడుతూ...తెలుగులో ఎప్పుడు చేస్తున్నార‌ని చాలాసార్లు అడిగేవారు. మ‌న ఇండియ‌న్ క‌ల్చ‌ర్ కి బాగా సెట్ అయ్యేలా వంశీ ఈ క‌థను బాగా తెర‌కెక్కించారు. మా అమ్మ నాగార్జున గారి అభిమాని. ఈ సినిమా నాకు ఇచ్చిన‌ గిఫ్ట్ అంటే నాగ్ సార్. ఈ సినిమాకి మా బెస్ట్ ఇవ్వాల‌ని వ‌ర్క్ చేసాం. ఫ‌స్ట్ డే నుంచి టీమ్ అంతా క‌ల‌సి వ‌ర్క్ చేసాం. కొవ్వొత్తులా వంశీ ఈ సినిమాకి వ‌ర్క్ చేసారు.ఇంత క్వాలీటీతో సినిమా వ‌చ్చిందంటే పి.వి.పి గారే కార‌ణం. ఈ సినిమా చేస్తున్నంత సేపు చాలా ఎంజాయ్ చేసాం. సినిమా చూసిన త‌ర్వాత ప్రేక్ష‌కులు కూడా ఎంజాయ్ చేస్తారు. ఈ రోల్ చేయ‌డం నాగార్జున గారు బాగా ఎంజాయ్ చేసారు. లైఫ్ విలువ నాగ్ సార్ కి తెలుసు. ఊపిరి నాకు వెరీ వెరీ స్పెష‌ల్ ఫిలిమ్ అన్నారు.
ప్ర‌కాష్ రాజ్ మాట్లాడుతూ....నాగార్జున గ్రేట్ ఫ్రెండ్. ఒక వ్య‌క్తి ఎదిగితే వాడు ఎదిగిన‌ ఎత్తుకు త‌గ్గ‌ట్టు మ‌రో ప‌ది మంది ఎదిగేలా చేస్తేనే ఆ ఎదుగుద‌ల‌కు అర్ధం ఉంటుంది. కొత్త సినిమాలు చేయాల‌ని టాలెంట్ ఉన్న‌వాళ్లిని ప్రొత్స‌హిస్తూ త‌న చుట్టూ ఉన్న‌వాళ్ల‌ను ఎదిగేలా చేసే మంచి వ్య‌క్తి నాగార్జున‌. ఇలాంటి వ్య‌క్తి వ‌ల‌న ఊపిరి సినిమా వ‌చ్చింది. కార్తీ తండ్రి, సోద‌రుడు మంచి న‌టుటు. వాళ్ల లాగే కార్తీ మంచి న‌టుడు. త‌ను ఎన్నుకున్న విధానం అత‌నిలో ఉన్న వ్య‌క్తిత్వం క‌నిపిస్తుంది. వంశీతో నాకు మూడో సినిమా. ఇలాంటి సినిమా తీస్తాడ‌ని నేను అనుకోలేదు. తెలుగు ప్రేక్ష‌కులు కోరుకుంటున్న విధంగా ఇది కొత్త సినిమా. ఈ సినిమాలో చాలా ఇంట్ర‌స్టింగ్ రోల్ దొరికింది. సీతారామ‌శాస్త్రి, అబ్బూరి ర‌వి, సాల్మాన్ ఎంతో మంది క‌ల‌సి మంచిసినిమాని అందించారు. మ‌న‌సుతో చూడాల్సిన సినిమా ఊపిరి అన్నారు.
గోపీసుంద‌ర్ మాట్లాడుతూ....సంగీత ద‌ర్శ‌కుడిగా కాకుండా ఓ ప్రేక్ష‌కుడుగా చెబుతున్నాను ఊపిరి నాకు న‌చ్చింది. నేను హిట్ అవుతుంది అని చెప్పిన ప్ర‌తి సినిమా హిట్ అయ్యింది ఊపిరి ఖ‌చ్చితంగా మెగా హిట్ అవుతుంది. రెండు మూడు సినిమాల త‌ర్వాత తెలుగులో మాట్లాడ‌తాను అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment