ఊపిరి ఆడియోకి ముహుర్తం కుదిరింది..
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ కింగ్ నాగార్జున - కోలీవుడ్ యంగ్ హీరో కార్తీ - మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్లో రూపొందుతున్న క్రేజీ మూవీ ఊపిరి. ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నారు. ఈ భారీ క్రేజీ మూవీని తెలుగు, తమిళ్ లో పి.వి.పి సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ సినిమాలో అడవి శేషు - అనుష్క జంటగా కనిపించనున్నారు. అలాగే అందాల తార శ్రియ ఓ ముఖ్య పాత్రలో నటించినట్టు సమాచారం.
సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో సెన్సేషనల్ హిట్ సాధించిన కింగ్ నాగార్జున ఊపిరి సినిమాతో బ్లాక్ బష్టర్ సాధించడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఇక ఆడియో విషయానికి వస్తే...గోపీ సుందర్ మ్యూజిక్ అందించిన ఊపిరి ఆడియోను ఫిబ్రవరి 28న గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments