ఊపిరి కోసం సెంటిమెంట్ ఫాలో అవుతున్న నాగ్..
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ కింగ్ నాగార్జున - కోలీవుడ్ హీరో కార్తీ - మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్లో రూపొందిన క్రేజీ మల్టీస్టారర్ ఊపిరి. వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్నితెరకెక్కించారు. పి.వి.పి సంస్థ తెలుగు, తమిళ్ లో ఈ చిత్రాన్నిప్రతిష్టాత్మకంగా నిర్మించింది. గోపీ సుందర్ సంగీతం అందించిన ఊపిరి ఆడియో ఇటీవల రిలీజైంది. ఈ చిత్రాన్ని ఈనెల 25న తెలుగు, తమిళ్ లో రిలీజ్ చేయనున్నారు.
ఇదిలా ఉంటే...సోగ్గాడే చిన్నినాయనా సినిమాతో నాగ్ బ్లాక్ బష్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి నాగ్ వారసులు చైతన్య, అఖిల్ పంచె కట్టుకుని ప్రమోషన్ చేసారు. ఈ సినిమా 50 కోట్ల క్లబ్ లో చేరి సెన్సేషన్ క్రియేట్ చేసింది. కొడుకులు ప్రమోషన్ చేస్తే బ్లాక్ బష్టర్ విజయం రావడంతో సెంటిమెంట్ గా ఫీలై నాగ్ ఊపిరి సినిమాకి కూడా తన వారసులతో ప్రమోషన్ స్టార్ట్ చేసారు. ఈరోజు మధ్యాహ్నాం 3 గంటలకు ప్రసాద్ ల్యాబ్స్ చైతు, అఖిల్ చేతుల మీదుగా ఊపిరి ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. మరి...చైతు, అఖిల్ ప్రమోషన్ చేసిన సోగ్గాడే చిన్ని నాయనా సెన్సేషన్ క్రియేట్ చేసినట్టుగా ఊపిరి కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com