Oo Antava Mava Ooo:శివరాత్రి కానుకగా ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ’ రిలీజ్

  • IndiaGlitz, [Friday,February 17 2023]

యశ్వంత్‌, రాకింగ్‌ రాకేష్‌, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్‌ కీలక పాత్రధారులుగా సీనియర్‌ దర్శకుడు రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించిన చిత్రం ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ’. తుమ్మల ప్రసన్న కుమార్‌ నిర్మాత. పోస్ట్‌ ప్రొడక్షన్‌, సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని మహా శివరాత్రి పర్వదినాన ఈ నెల 18న విడుదల కానుందీ చిత్రం.

నిర్మాత ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ... ‘‘రేలంగి నరసింహారావు ఎన్నో విజయవంతంమైన చిత్రాలు తీశారు. ఇది ఆయన చేస్తున్న 76వ చిత్రం. చక్కని కథతో తెరకెక్కించారు. మా టీమ్‌ అంతా ఇది మన సినిమా అని ఆప్యాయంగా పని చేశారు. కాశ్మీర్‌, హైదరాబాద్‌ ప్రాంతాల్లో అందమైన లొకేషన్‌లలో చిత్రీకరణ చేశాం. అవుట్‌పుట్‌ అద్భుతంగా వచ్చింది. పాటలు చక్కగా కుదిరాయి. ఇందులో కామెడీ, హారర్‌ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. రీసెంట్ గా ప్రసాద్ లాబ్స్ లో చాలామంది కి సినిమా చూపించాం. అందరికీ బాగా నచ్చింది. ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ’ సినిమాను మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 18న విడుదల చేస్తాం’’ అని అన్నారు. చిన్న సినిమాలను ఎప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తారు. అలానే ఈ సినిమాకి కూడా మంచి ఆదరణ లభిస్తుంది అని అనుకుంటున్నాం.

యశ్వంత్‌, రాకింగ్‌ రాకేష్‌, అనన్య, హిందోలా చక్రవర్తి, రఘు కుంచె, సురేశ్‌ కొండేటి, తుమ్మలపల్లి, రామారావు, రామసత్యనారాయణ, కాదంబరి కిరణ్‌ తదితరులు ఈ సినీ కార్యక్రమంలో పాల్గొన్నారు

నటీ, నటులు: యశ్వంత్, రాకింగ్‌ రాకేష్, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్‌, సత్య కృష్ణ, రఘు కుంచె, బాబు మోహన్, కాదంబరి కిరణ్, ఆకెళ్ల జబర్దస్త్ గణపతి, జెన్నీ తదితరులు.

More News

SIR: 'సార్' సినిమాకి ప్రేక్షకుల బ్రహ్మరథం..

కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించిన ద్విభాషా చిత్రం 'సార్'(వాతి). ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి తెలుగు,

Katha Venuka Katha:డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని ఆవిష్క‌రించిన  స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌ ‘కథ వెనుక కథ’ టీజ‌ర్‌

కొత్త కాన్సెప్ట్ చిత్రాల‌ను అందిస్తూ న్యూ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయటానికి ప్రారంభ‌మైన నిర్మాణ సంస్థ దండమూడి బాక్సాఫీస్.

Puli Meka:మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ రిలీజ్ చేసిన జీ 5 ‘పులి మేక’ టీజర్

సాధార‌ణంగా నేరాలు జ‌రిగిన‌ప్పుడు ప్ర‌జ‌లు పోలీసుల‌ను ఆశ్ర‌యిస్తారు. మ‌రి వారినే ఓ హంత‌కుడు టార్గెట్ చేసి చంపుతుంటే పోలీసులు ఏం చేస్తారు?

Premi Viswanath : కార్తీకదీపంలో ‘నల్ల’ పిల్ల క్యారెక్టర్ వల్ల చిక్కులు.. అలర్జీ బారినపడ్డ వంటలక్క

ప్రేమి విశ్వనాథ్.. అంటే గుర్తుపట్టడం కష్టమే. అదే కార్తీక దీపం వంటలక్క అంటే చాలు చిన్నారుల నుంచి పెద్దల వరకు టక్కున బుర్రలో లైట్ వెలుగుతుంది.

Harish Rao:కాళేశ్వరానికి భూమిని దానం చేసిన అంబటి రాయుడు, తొలి సంతకం ఆయనదే : నిజం బయటపెట్టిన హరీశ్ రావు

టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడుపై ప్రశంసల వర్షం కురిపించారు బీఆర్ఎస్ నేత, తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీశ్ రావు.