జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు దర్శకత్వంలో,'ఆర్జీవీ' చిత్ర ముహూర్తం

  • IndiaGlitz, [Monday,February 10 2020]

కార్తికేయ చిత్రనిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం సమర్పణలో, ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు దర్శకత్వంలో, మాగ్నస్ సినీప్రైమ్ పతాకంపై బాల కుటుంబరావు పొన్నూరి నిర్మిస్తున్న 'ఆర్జీవీ' చిత్ర ముహూర్తం మరియు పూజా కార్యక్రమాలు ది 09-02-2020న హైదరాబాద్ లో నిర్మాణ సంస్థ కార్యాలయంలో చిత్ర బృందం సమక్షంలో జరిగాయి,

ఈ సందర్భంగా నిర్మాత బాల కుటుంబరావు పొన్నూరి మాట్లాడుతూ.. ఒక విద్యావేత్తగా పాఠాలు చెప్పి మంచిని బోధించే వృత్తిలో ఉన్న తనకు జొన్నవిత్తుల గారు చెప్పిన కథ నచ్చి సామాజిక బాధ్యతగా మొదటిసారి ఈ చిత్ర నిర్మాణానికి పూనుకున్నానని ఒక మంచి చిత్రం అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. చిత్రానికి కధా, మాటలు, పాటలు, చిత్రానువాదం సమకూర్చిన దర్శకులు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో లో కొందరు వ్యక్తులు స్వేచ్ఛ పేరుతో యువతను తప్పుదోవ పట్టించే భావజాలాన్ని ఒక సిద్ధాంతంలా ఎక్కించడం వల్ల సమాజానికి కలిగే నష్టాన్ని ఒక ఆసక్తికరమైన చిత్రంగా తెరకెక్కిస్తున్నానని, ఈ చిత్రం పిచ్చెక్కించే వినోదంతో పాటు అటువంటి వాళ్లకు పిచ్చి తగ్గించే ఔషధం అవుతుందని, ప్రధాన నటులు, మరియు సాంకేతికనిపుణుల వివరాలు త్వరలో నిర్మాత తెలియజేస్తారని, చిత్రీకరణ కార్యక్రమం మార్చి మొదటివారంలో ప్రారంభిస్తామని తెలియజేసారు.

More News

తెలుగువారి భ‌విష్య‌త్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ గేమ్ చేంజ‌ర్ `ఆహా ఓటీటీ` - విజ‌య్ దేవ‌ర‌కొండ‌

నేటి యువ‌త ఆలోచ‌న‌ల‌ను, అభిరుచికి త‌గిన విధంగా కొత్త కంటెంట్‌తో సినిమా రంగానికి ధీటుగా డిజిట‌ల్ రంగంలో అభివృద్ధి చెందుతుంది.

'భీష్మ' 'సరాసరి' గీతం విడుదల

నితిన్,రష్మిక మందన,వెంకీ కుడుముల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్

'జాను' థాంక్స్ మీట్

శర్వానంద్‌, సమంత అక్కినేని హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం `జాను`. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై సి.ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో

ఆస్కార్ విజేత‌లు వీరే

లాస్ ఏంజిల్స్‌లో 92వ అకాడ‌మీ అవార్డుల వేదిక ఘ‌నంగా జరుగుతోంది. హాలీవుడ్‌లో ఆస్కార్ అవార్డుల‌కు ఉన్న ప్రాధాన్య‌త గురించి ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

సైబర్ పోలీసులకు యాంకర్ అనసూయ ఫిర్యాదు

జబర్‌ద‌స్త్ ప్రోగ్రామ్ ద్వారా యాంక‌ర్‌గా పాపుల‌ర్ అయిన అన‌సూయ త‌ర్వాత టీవీ షోస్‌తో ఫుల్ బిజీగా మారింది.