'వన్' ట్రైలర్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్లూరి చంద్రంగా మమ్ముట్టి
Send us your feedback to audioarticles@vaarta.com
ఓటిటి రిలీజ్ తో పాటు, డబ్బింగ్ చిత్రాల ట్రెండ్ కూడా కొనసాగుతోంది. మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన వన్ చిత్రం ఈ ఏడాది మార్చిలో విడుదలై మంచి విజయం దక్కించుకుంది. ఇప్పుడు ఆ చిత్రాన్ని తెలుగులో డబ్ చేసి ఆహా ఒత్తిడిలో రిలీజ్ చేస్తున్నారు. జూలై 30 నుంచి ఈ చిత్రం ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
దీనితో తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. 'ఓ బార్బర్ కొడుకు ముఖ్యమంత్రి అయితే ఇలాగే తగలడుతుంది' అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది. అల్లర్లు, ధర్నాలు చూపించిన తర్వాత మమ్ముటి ఎంట్రీ ఇస్తారు. మమ్ముటి తెలంగాణ ముఖ్యమంత్రి కల్లూరి చంద్రం గా ఈ చిత్రంలో నటిస్తున్నారు.
'తెలంగాణకి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు.. కల్లూరి చంద్రం అతని పేరు' అంటూ మమ్ముట్టి చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. రాజకీయ ఒత్తిళ్లు, ప్రతిపక్షాల కుట్రలు, రాజకీయ నేతల బెదిరింపుల నడుమ ముఖ్యమంత్రిగా మమ్ముట్టి రాష్ట్రాన్ని ఎలా రక్షించాడు అనేది కథగా తెలుస్తోంది.
ముఖ్యమంత్రి పాత్రలో మమ్ముట్టి బాగా ఫిట్ అయ్యారు. అయన బాడీ లాంగ్వేజ్ పొలిటికల్ డ్రామాకు బాగా సెట్ అయినట్లు ఉంది. సంతోష్ విశ్వనాధ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. గోపిసుందర్ సంగీతం అందించారు.
వన్ చిత్రం తెలుగులో మంచి రెస్పాన్స్ అందుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మమ్ముట్టి తెలుగులో ఆల్రెడీ 'యాత్ర' అనే పొలిటికల్ మూవీలో వైఎస్ఆర్ పాత్రలో నటించి మెప్పించారు.. యాత్ర చిత్రం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments