Ravi Teja:తెలుగు సినిమా బాగు కోసం ఒక్క అడుగు వెనక్కేశా: రవితేజ
- IndiaGlitz, [Friday,January 05 2024]
తెలుగు ప్రజలు జరుపుకునే పెద్ద పండు సంక్రాంతి. కోడిపందాలు, గాలిపటాలు, నోరూరించే వంటలే కాదు సినిమాలు కూడా మంచి అనుభూతిని కలిగిస్తాయి. అందుకే ఈ పండుగకు అభిమానులను అలరించేందుకు స్టార్ హీరోలు పోటీ పడుతూ ఉంటారు. ప్రతి ఏడాది రెండు, మూడు సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. అయితే ఈసారి మాత్రం ఏకంగా ఐదు చిత్రాలు పండుగకు అలరించేందుకు సిద్ధమయ్యాయి. దీంతో థియేటర్స్ సమస్య తలెత్తింది. అయితే ఏదో ఒక సినిమా విడుదల ఆపాలని నిర్మాత మండలి గట్టిగా ప్రయత్నించింది. కానీ ఎవరూ వెనకడుగు వేయలేదు.
అయితే ఎట్టకేలకు నిర్మాత మండలి చర్చలు ఫలించాయి. పండుగ బరి నుంచి మాస్ మహారాజా వెనక్కి తప్పుకున్నారు. ఆయన నటించిన 'ఈగల్' మూవీని ఫిబ్రవరి 9కి వాయిదా వేశారు. దీంతో గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామిరంగ చిత్రాలు సంక్రాంతి పోటీలో నిలిచాయి. మూవీ వాయిదాపై రవితేజతో పాటు చిత్ర నిర్మాణ సంస్థ స్పందించింది. మన తెలుగు సినిమా బాగుండాలని ఒక స్టెప్ వెనక్కి వేస్తున్నాను. రావడం లేట్ అవ్వొచ్చు కానీ గురి తప్పడం కాదు. ఈగల్ ఫిబ్రవరి 9న రిలీజ్ అవ్వబోతుంది. సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాలకు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.
అలాగే నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కూడా ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. మొండోడి మనసు పుట్ట తేనే. తన నిర్మాత, పరిశ్రమ బాగు కోసం బరిని సంక్రాంతి నుండి ఫిబ్రవరికి తీసుకొచ్చాడు. అందరూ చూడాల్సిన జనరంజక చిత్రం ప్రదర్శించడానికి అంతే మొత్తంలో థియేటర్లు కావాల్సి ఉంటుంది, దర్శకుడు మొదలుకుని సృజనాత్మక సిబ్బంది పనిని ప్రేక్షకులు చూసి మెచ్చుకోడానికి ఒక ఇరుకులేని వేదిక, సమయం కావాలి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని బరిలో రద్దీని తగ్గించే నిర్ణయం తీసుకున్నారు. మారింది తేది మాత్రమే మాసోడి మార్క్ కాదు అని అందులో తెలిపింది. దీంతో సినీ ఇండస్ట్రీ బాగు కోసం రవితేజ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
బాగు కోసం బరిలో రద్దీ తగ్గించాం.💥
— People Media Factory (@peoplemediafcy) January 5, 2024
మొండోడి మనసు పుట్ట తేనే. తన నిర్మాత, పరిశ్రమ బాగు కోసం బరిని సంక్రాంతి నుండి Februaryకి తీసుకొచ్చాడు.❤️🔥
మారింది తేది మాత్రమే మాసోడి mark కాదు. 😎
Now, EAGLE 🦅 takes flight for a global release in Telugu & Hindi on FEB 9th, 2024! 💥🔥… pic.twitter.com/VD20y8aAL2