ఒకే సినిమా.. మూడు హ్యాట్రిక్ లు

  • IndiaGlitz, [Friday,October 20 2017]

దీపావ‌ళి కానుక‌గా బుధ‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సినిమా రాజా ది గ్రేట్‌. బెంగాల్ టైగ‌ర్ త‌రువాత దాదాపు రెండేళ్ల గ్యాప్‌తో మాస్ మ‌హారాజ్ ర‌వితేజ తెర‌పై సంద‌డి చేసిన చిత్ర‌మిది. దిల్ రాజు నిర్మాణంలో వ‌చ్చిన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకోవ‌డ‌మే కాకుండా.. క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తోంది. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం లో మెహ‌రీన్ క‌థానాయిక‌గా న‌టించింది.

ఇదిలా ఉంటే.. రాజా ది గ్రేట్ తో మూడు హ్యాట్రిక్ లు సొంతమైన‌ట్ల‌య్యింది. ప‌టాస్‌, సుప్రీమ్ చిత్రాల త‌రువాత ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడికి ముచ్చ‌ట‌గా మూడో విజ‌యం ద‌క్కితే.. కృష్ణ‌గాడి వీర‌ప్రేమ‌గాథ‌, మ‌హానుభావుడు త‌రువాత క‌థానాయిక మెహ‌రీన్‌కి వ‌రుస‌గా మూడో హిట్ ద‌క్కిన‌ట్ల‌య్యింది. అంతేకాకుండా.. అనిల్‌, సంగీత ద‌ర్శ‌కుడు సాయికార్తీక్‌కి కూడా ఇది హ్యాట్రిక్ మూవీ కావ‌డం విశేషం.