గోపీచంద్ చిత్రంలో మ‌రోసారి...

  • IndiaGlitz, [Wednesday,February 21 2018]

'ఆంధ్రుడు', 'య‌జ్ఞం', 'ల‌క్ష్యం', 'శౌర్యం', 'లౌక్యం' వంటి సూప‌ర్‌డూప‌ర్ చిత్రాలతో మెప్పించిన టాలీవుడ్ ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ క‌థానాయ‌కుడిగా శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇది గోపీచంద్ 25వ చిత్రం కావ‌డం విశేషం.

దీనికి 'పంతం' అనే టైటిల్‌ను నిర్ణ‌యించారు. 'ఫ‌ర్ ఎ కాస్‌' ఉప‌శీర్షిక‌. 'బ‌లుపు', 'ప‌వ‌ర్‌', 'జై ల‌వకుశ' వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌కు స్క్రీన్‌ప్లే అందించిన కె.చ‌క్ర‌వ‌ర్తి ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్‌ను కె.కె.రాధామోహ‌న్ నిర్మిస్తున్నారు.

ఈ సినిమాను మే 18న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లోనే ఈ సినిమాలో హంసా నందిని కీల‌క‌పాత్ర‌లోన‌టించ‌నుంది. గ‌తంలో గోపీచంద్ 'లౌక్యం' సినిమాలో స్పెష‌ల్ రోల్‌లో న‌టించింది. అయితే ఈసారి త‌న పాత్ర సినిమాకు చాలా కీల‌కంగా ఉంటుంద‌ని హంసా నందిని భావిస్తోంద‌ట‌.

More News

ముందుగానే 'కిరాక్ పార్టీ'

వ‌రుస విజ‌యాల‌తో, వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో దూసుకుపోతున్న యువ క‌థానాయ‌కుడు నిఖిల్ న‌టిస్తున్న చిత్రం 'కిరాక్ పార్టీ'.  ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. సిమ్ర‌న్ ప‌ర్జీనా, సంయుక్త హెగ్డే క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు.

దేశ‌దిమ్మ‌రి కోసం త‌నీష్ గానం

యంగ్ హీరో త‌నీష్ దేశ‌దిమ్మ‌రి గా ముస్తాబౌతున్నాడు. స‌వీన క్రియేష‌న్స్ ప‌తాకంపై న‌గేష్ నార‌దాసి సార‌ధ్యంలో తెర‌కెక్కుతున్న దేశ‌దిమ్మ‌రిలో త‌నీష్ కు జోడీగా ష‌రీన్ హీరోయిన్ గా న‌టిస్తోంది.

'రాజరథం' లో నిరూప్ భండారి చెప్పిన 'దెయ్యం కథ'

నిరూప్ భండారి తన సోదరుడు అనూప్ భండారి దర్శకత్వంలో అత్యున్నత ప్రమాణాలతో  అందమైన ప్రేమకథ గా తెరకెక్కుతున్న 'రాజరథం' చిత్రీకరణ సమయంలో ఎన్నో సరదా సంఘటనలు జరిగినట్టు చెప్పారు.

'సత్య గ్యాంగ్' సాంగ్స్ సూపర్ అంటున్నారు!!

సాత్విక్ ఈశ్వర్ ని హీరోగా పరిచయం చేస్తూ.. సిద్ధయోగి క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ వన్ గా కర్నూలుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు-వ్యాపారవేత్త మహేష్ ఖన్నా నిర్మిస్తున్న చిత్రం 'సత్య గ్యాంగ్'.

క్రైమ్ థ్రిల్ల‌ర్ స‌బ్జెక్ట్‌తో సాయిధ‌ర‌మ్ చిత్రం?

మానవతా విలువలు గల సినిమాలను తెరపై ఆవిష్కరించడంలోనూ.. ఉత్కంఠ‌భరితమైన మూవీలను తెరకెక్కించడంలోనూ..  ప్రయోగాత్మక చిత్రాలను రూపొందించడంలోనూ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి సిద్ధహస్తుడు.