గోపీచంద్ చిత్రంలో మరోసారి...
Send us your feedback to audioarticles@vaarta.com
'ఆంధ్రుడు', 'యజ్ఞం', 'లక్ష్యం', 'శౌర్యం', 'లౌక్యం' వంటి సూపర్‌డూపర్ చిత్రాలతో మెప్పించిన టాలీవుడ్ ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది గోపీచంద్ 25వ చిత్రం కావడం విశేషం.
దీనికి 'పంతం' అనే టైటిల్‌ను నిర్ణయించారు. 'ఫర్ ఎ కాస్' ఉపశీర్షిక. 'బలుపు', 'పవర్', 'జై లవకుశ' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు స్క్రీన్‌ప్లే అందించిన కె.చక్రవర్తి ఈ చిత్రానికి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ను కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు.
ఈ సినిమాను మే 18న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలోనే ఈ సినిమాలో హంసా నందిని కీలకపాత్రలోనటించనుంది. గతంలో గోపీచంద్ 'లౌక్యం' సినిమాలో స్పెషల్ రోల్‌లో నటించింది. అయితే ఈసారి తన పాత్ర సినిమాకు చాలా కీలకంగా ఉంటుందని హంసా నందిని భావిస్తోందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com