'మణికర్ణిక' కు మరో షాక్
Send us your feedback to audioarticles@vaarta.com
కంగనా రనౌగ్ టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం `మణికర్ణిక`. జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. ప్రథమ స్వాంతంత్ర్య సమరంలో బ్రిటీష్ వారిని ఎదిరించిన ఝాన్సీ లక్ష్మీబాయ్ జీవిత చరిత్రే ఈ సినిమా. భారీ బడ్జెట్, టెక్నికల్ వేల్యూస్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ పూర్తై నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. విడుదల తేది దగ్గరపడుతున్న కొద్ది సినిమాకి పనిచేసిన లైట్‌మెన్స్, వర్కర్స్‌కి మూడు నెలలుగా జీతభత్యాలు చెల్లించలేదట. దాంతో ఆగ్రహించిన వర్కర్క్స్, జూనియర్ ఆర్టిస్ట్స్‌లు ఎక్కడ పనిని అక్కడే సెట్‌లో వదిలేసి ఎఫ్ డబ్ల్యూ ఐసీ (ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా ఆఫ్ సినీ ఎంప్లాయిస్)ను ఆశ్రయించారట.
``లైట్‌మెన్‌కు 90 లక్షలు.. జూనియర్ ఆర్టిస్ట్‌లకు 20 లక్షలు ఇవ్వాలి. నిర్మాత కమల్ జైన్ అక్టోబర్‌లో ఇస్తామన్న వేతనాలు ఇంకా ఇవ్వలేదు. ఫోన్ చేసినా రిప్లై ఇవ్వడం లేదు. పని ఆగిపోతే డబ్బులు ఇవ్వమంటూ బెదిరిస్తున్నారు. అందుకే ఎఫ్ డబ్ల్యూ ఐసీని కలిశాం`` అని ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ అశోక్ దూబే తెలిపారు.
మణికర్ణిక చాలా సమస్యలను ఎదుర్కొంటుంది. క్రిష్ కమిట్‌మెంట్స్ కారణంగా డైరెక్షన్ చేయకపోవడంతో... కంగనాయే ఈ సినిమాను డైరెక్ట్ చేసింది. టాలీవుడ్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమాను 2019 జనవరి 25న విడుదల చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Liya Harini
Contact at support@indiaglitz.com
Comments