రామ్‌గోపాల్ వర్మకు మరో ఎదురుదెబ్బ
Send us your feedback to audioarticles@vaarta.com
లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రదర్శనలు అనుమతించొద్దు
కలెక్టర్లు, ఎస్పీలకు ఈసీ సూచన
కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇంకా అమల్లోనే..
తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నిషేధం తప్పదన్న ఈసీ
టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన వివాదాస్పద చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదలైనప్పటికీ ఎన్నికల కోడ్ దృష్ట్యా ఆంధ్రప్రదేశ్‌లో విడుదలకాలేదు. అయితే మే-01న విడుదల చేయానికి చిత్రబృందం సిద్ధమైంది. అయితే ఈ చిత్రంపై ఈసీ నిషేధం అమల్లోనే ఉందని, ఆ సినిమా ప్రదర్శనలను ఎక్కడా అనుమతించొద్దని రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు స్పష్టం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఏప్రిల్ 10న దేశంలో రాజకీయ బయోపిక్‌లపై ఎన్నికలు ముగిసేంత వరకు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష జరిపి, మళ్లీ ఉత్తర్వులు ఇచ్చేవరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని ఈసీ పేర్కొంది. నిషేధం విధిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన ఉత్తర్వుల ప్రతులను ఈసీ తాజాగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు పంపింది. ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉందంటూ వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ తో పాటు మరో రెండు సినిమాలను కూడా కేంద్ర ఎన్నికల సంఘం నిలిపివేసింది. అయితే, తన సినిమా విడుదలకు సహకరించాలంటూ లక్ష్మీస్ ఎన్టీఆర్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈసీని కోరగా, కుదరదని ఈసీ స్పష్టం చేసింది. ఆ మేరకు వర్మకు సీఈవో ద్వివేది లేఖ కూడా రాశారు. మే 01న తన సినిమా రిలీజ్ కోసం పట్టుదలగా ఉన్న వర్మకు ఇది కచ్చితంగా ఎదురుదెబ్బేనని చెప్పుకోవచ్చు. అయితే ఈ వ్యవహారంపై ఆర్జీవీ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout