ఏడాదికో మెగా వారి సినిమా

  • IndiaGlitz, [Thursday,August 10 2017]

అందాల రాక్ష‌సితో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన లావ‌ణ్య త్రిపాఠి.. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, సోగ్గాడే చిన్ని నాయ‌నా, శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు చిత్రాల‌తో హిట్ చిత్రాల క‌థానాయిక అనిపించుకుంది. ఇదిలా ఉంటే.. ఈ ముద్దుగుమ్మ సంవ‌త్స‌రానికో మెగా వారి సినిమా చేస్తూ వార్త‌ల్లో నిలుస్తోంది. గ‌తేడాది విడుద‌లైన శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు కోసం అల్లు శిరీష్ స‌ర‌స‌న సంద‌డి చేసిన లావ‌ణ్య‌.. ఈ ఏడాది ప్ర‌థ‌మార్థంలో వ‌రుణ్‌తేజ్ కి జోడీగా మిస్ట‌ర్‌లో ద‌ర్శ‌న‌మిచ్చింది.
ఈ వ‌రుస‌లోనే మ‌రో చిత్రం చేరింది. అదే సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న చిత్రం. ఇందులోనూ లావ‌ణ్య‌కి క‌థానాయిక‌గా ఛాన్స్ వ‌చ్చింది. ఇటీవ‌లే ప్రారంభ‌మైన ఈ చిత్రం వ‌చ్చే ఏడాది ప్ర‌థ‌మార్థంలో విడుద‌ల అవుతుంద‌ని స‌మాచారం. అంటే.. మూడేళ్ల పాటు ఏడాదికో మెగా వారి సినిమా లావ‌ణ్య ఖాతాలో ఉంద‌న్న‌మాట‌. భ‌విష్య‌త్‌లోనూ ఇదే ప‌రంప‌ర‌ని కొన‌సాగిస్తూ.. మిగిలిన మెగా హీరోల కూడా ప‌క్క‌న లావ‌ణ్య అవ‌కాశాల‌ను ద‌క్కించుకుంటుందో లేదో మ‌రి.