ఒకటి పవన్ డైరెక్టర్.. మరోకటి చిరు డైరెక్టర్..
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాబ్రదర్స్ మేనల్లుడిగా ఎంట్రీ ఇచ్చినా.. తన ఎనర్జీతో ఆకట్టుకుంటున్నాడు యువ కథానాయకుడు సాయి ధరమ్ తేజ్. పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ విజయాలతో తన కంటూ ఓ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న సాయి.. ఆ తరువాత మాత్రం సరైన విజయాన్ని తన ఖాతాలో వేసుకోలేకపోతున్నాడు. తిక్క, విన్నర్, నక్షత్రం.. ఇలా ఫ్లాప్‌ల హ్యాట్రిక్ అతనికి దక్కింది. ఈ నేపథ్యంలో రాబోయే జవాన్‌పై బోలోడు ఆశలు పెట్టుకున్నాడు. త్వరలోనే ఈ సినిమా తెరపైకి రానుంది.
ఇదిలా ఉంటే.. ఇటీవలే సాయి రెండు కొత్త చిత్రాలను సెట్స్ పైకి ఎక్కించాడు. విశేషమేమిటంటే.. ఆ రెండు చిత్రాల దర్శకులు కూడా తన మావయ్యలకు కలిసొచ్చిన డైరెక్టర్‌లే కావడం. ఠాగూర్, ఖైదీ నెం.150 చిత్రాలతో చిరంజీవికి కలిసొచ్చిన వి.వి.వినాయక్ కాంబినేషన్‌లో సాయిధరమ్ ఓ సినిమా చేస్తుండగా.. తొలి ప్రేమ వంటి ఘనవిజయంతో పాటు బాలు వంటి యావరేజ్ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో చేసిన ఎ.కరుణాకరన్ కాంబినేషన్‌లో మరో సినిమా చేస్తున్నాడు. మరి మావయ్యల డైరెక్టర్స్ సాయికి కూడా హిట్ ఇస్తారేమో చూడాలి. అన్నట్టు.. గబ్బర్‌సింగ్ వంటి హిట్ చిత్రాన్ని తన చినమావయ్య పవన్ కాంబినేషన్‌లో చేసిన హరీష్ శంకర్.. సుబ్రమణ్యం ఫర్ సేల్ అనే హిట్‌ని సాయికి అందించిన వైనం ఈ తాజా చిత్రాలకూ వర్కవుట్ అవుతుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com