సోలోకి ఒక్క రోజు ముందు..
Send us your feedback to audioarticles@vaarta.com
ఆరేళ్ల క్రితం విడుదలైన సోలో చిత్రం మంచి విజయం సాధించింది. నారా రోహిత్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి మణిశర్మ అందించిన సంగీతం బాగా ప్లస్ అయ్యింది. నవంబర్ 25, 2011న సోలో విడుదలైంది. కట్ చేస్తే.. ఆ రోజుకి ఒక్క రోజు (నవంబర్ 24) ముందు ఇదే నారా రోహిత్, మణిశర్మ కాంబినేషన్‌లో మరో చిత్రం రాబోతోంది.
ఆ సినిమానే బాలకృష్ణుడు. హైదరాబాద్, కర్నూల్ చుట్టూ తిరిగే ఫ్యాక్షన్ బేస్‌డ్ లవ్ స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కింది. నారా రోహిత్ సరసన రెజీనా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి పవన్ మల్లెల దర్శకత్వం వహించారు. మహేంద్రబాబు, వంశీ, వినోద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర పోషించింది.
ఈ పాత్ర.. గతంలో రమ్యకృష్ణ నటించిన నరసింహా సినిమాలోని నీలాంబరి పాత్రకు.. అలాగే ఈ మధ్య వచ్చిన బాహుబలి, బాహుబలి2లోని శివగామి పాత్రకు ఏ మాత్రం తీసిపోదని చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి. మంచి అంచనాల మధ్య వస్తున్న బాలకృష్ణుడు.. ఇప్పటికే ఫస్ట్‌లుక్, సెకండ్‌లుక్‌తో ఆకట్టుకుంది. మరి సినిమా కూడా ఆకట్టుకుంటుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments