మళ్ళీ అదే సెంటిమెంట్‌తో..
Send us your feedback to audioarticles@vaarta.com
‘గమ్యం’, ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుం’, ‘కంచె’ లాంటి సినిమాలతో వైవిధ్యమైన చిత్రాల దర్శకుడు అనిపించుకున్నారు క్రిష్. క్రిష్‌లోని సృజనాత్మకతకు మెచ్చి నందమూరి బాలకృష్ణ తన వందో చిత్రాన్ని అతని చేతిలో పెట్టారు. బాలయ్య నమ్మకాన్ని వమ్ము చేయకుండా శాతవాహన చక్రవర్తి శాతకర్ణి చరిత్రను ‘గౌతమిపుత్ర శాతకర్ణి’పేరుతో ఎంతో చక్కగా వెండితెరపై ఆవిష్కరించారు ఈ దర్శకుడు. 2017 సంక్రాంతికి విడుదలైన ఈ చారిత్రాత్మక చిత్రం బాలయ్య కెరీర్లో గుర్తుండి పోయే చిత్రంగా నిలవడమే గాకుండా.. మంచి వసూళ్లను కూడా రాబట్టింది. మళ్ళీ మరోసారి 2019 సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నారు క్రిష్.
ఆ వివరాల్లోకి వెళితే.. మహానటుడు ఎన్.టి.రామారావు జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘యన్.టి.ఆర్’ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలను త్వరగా రూపొందించడంలో దిట్ట అయిన క్రిష్.. త్వరలో పట్టాలెక్కనున్న ఈ సినిమాను కూడా సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసి.. వచ్చే ఏడాది (2019) సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. మరి 2017 సంక్రాంతి సెంటిమెంట్‌ను 2019లో కూడా బాలయ్య, క్రిష్ కాంబో రిపీట్ చేస్తుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com