అదే దర్శకుడితో మరోసారి...
- IndiaGlitz, [Monday,July 03 2017]
నేచురల్ స్టార్ నాని వరస విజయాలతో దూసుకుపోతున్నాడు. త్వరలోనే 'నిన్నుకోరి' అంటూ త్వరలోనే ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ యువ కథానాయకుడు కెరీర్ ప్రారంభంలో తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టాడు. అయితే అనుకున్న స్థాయిలో విజయాలు రాకపోవడంతో తెలుగులోనే కాన్సన్ట్రేషన్ చేశాడు.
త్వరలోనే ఓ తమిళ దర్శకుడితో కలిసి నాని పనిచేయయనున్నాడట. ఇంతకు ఆ దర్శకుడెవరో కాదు, గతంలో నానితో జెండాపై కపిరాజు సినిమాను తెరకెక్కించిన సముద్రఖని. దర్శకుడిగా సినీ రంగంలోకి వచ్చిన సముద్రఖని తర్వాత నటుడుగా బిజీ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ మెగాఫోన్ పట్టడానికి ప్రయత్నాలు చేసుకుంటున్నాడట. ఈ సినిమాను తెలుగు, తమిళంలో తెరకెక్కిస్తారట. తమిళంలో శశికుమార్ హీరోగా నటిస్తే తెలుగులో నాని హీరోగా నటిస్తాడని వార్తలు వినపడుతున్నాయి.