మరోసారి నితిన్ తోనే....

  • IndiaGlitz, [Saturday,June 10 2017]

ఇప్పుడు నితిన్ హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో 14 రీల్స్ బ్యాన‌ర్‌పై లై సినిమాలో న‌టిస్తున్నాడు. నితిన్‌కు జంట‌గా మేఘా ఆకాష్ న‌టిస్తుంది. మేఘా ఆకాష్ రామ్ స‌ర‌స‌న కూడా న‌టించ‌నుంది. ఇంకా ఒక్క సినిమా కూడా విడుద‌ల కాక మునుపే వ‌రుస అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంటుంది మేఘా ఆకాష్‌.

ఇప్పుడు మ‌రోసారి నితిన్‌తో జ‌త క‌ట్ట‌డానికి రెడీ అయిపోయింద‌ని స‌మాచారం. నితిన్ హీరోగా కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, త్రివిక్ర‌మ్ నిర్మాత‌లుగా నిర్మించ‌నున్న సినిమాలో హీరోయిన్‌గా మేఘా ఆకాష్ న‌టిస్తుంద‌ట‌. లై త‌ర్వాత నితిన్ కొత్త సినిమాలో న‌టించ‌డానికి రెడీ అవుతున్నాడు. సినిమాలు విడుద‌లైతే మ‌రి మేఘా స్పీడు ఎలా ఉంటుందో చూడాలంటే వెయిట్ చేయాల్సిందే..