గోపీచంద్‌తో మరోసారి..
Send us your feedback to audioarticles@vaarta.com
పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ చిత్రాలతో సక్సెస్ఫుల్ కథానాయకుడు అనిపించుకున్నాడు మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్. అయితే, ఆ తరువాత వచ్చిన తిక్క, విన్నర్, నక్షత్రం ఆశించిన విజయం సాధించలేదు. ప్రస్తుతం ప్రముఖ దర్శకులు వి.వి.వినాయక్, ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో రెండు సినిమాలు చేస్తున్నాడీ యువ కథానాయకుడు.
ఈ రెండు చిత్రాల తరువాత విన్నర్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో మరో సినిమా చేసేందుకు సాయిధరమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. జె.పుల్లారావు, జె.భగవాన్ సంయుక్తంగా నిర్మించే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. కాగా, బివీఎస్ రవి దర్శకత్వంలో సాయిధరమ్ నటించిన కొత్త చిత్రం జవాన్ విడుదలకి సిద్ధమైంది. థమన్ సంగీతమందించిన ఈ చిత్రంలోని సింగిల్‌ని ఇవాళ సాయిధరమ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com