మళ్ళీ దేవిశ్రీ ప్రసాద్‌తోనే..
- IndiaGlitz, [Tuesday,January 02 2018]
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. జనవరి 19 నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. విజయదశమి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వినిపిస్తోంది.
అదేమిటంటే.. అంతకుముందు ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకుడుగా ఎంపికయ్యాడని వార్తలు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం.. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి ఎంపికయ్యాడని తెలిసింది. రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న రంగస్థలం చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా.. బోయపాటి గత చిత్రం జయజానకి నాయకకి కూడా దేవిశ్రీనే స్వరాలు అందించాడు.
అంటే.. చరణ్, బోయపాటి వరుస రెండు చిత్రాలకు దేవిశ్రీ ప్రసాద్‌నే సంగీత దర్శకుడు అన్నమాట. తాజా సమాచారం ప్రకారం.. ఈ నెల 28 నుంచి రామ్ చరణ్ ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారని తెలిసింది.