మళ్ళీ బాలయ్య తోనే..

  • IndiaGlitz, [Monday,January 22 2018]

కొన్ని హిట్ కాంబినేషన్లు వెండితెరపై రిపీట్ అయితే చాలు.. సినిమా ఫలితం గురించి పెద్దగా ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే ఆ ఫలితం కూడా విజయాన్నే వరిస్తుంది కాబట్టి. దానికి నిదర్శనంగా ఇటీవల విడుదలైన జై సింహా' సినిమాని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో బాలకృష్ణ, నయనతార మూడోసారి జంటగా నటించారు. సింహా' సినిమాతో వీరి కలయికకి పునాది పడినా... శ్రీరామరాజ్యం'తో మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఈ రెండు సినిమాల విజయం జై సింహా'కి కూడా ప్లస్ అయిందనే చెప్పాలి.

అలాగే...నయనతారకి తెలుగులో బాలకృష్ణ బాగా అచ్చొచ్చిన హీరో. తన కెరీర్ చరమాంకంలో ఉందనుకున్నప్పుడు శ్రీరామరాజ్యం' అందించిన విజ‌యం న‌య‌న్‌కి బాగా ప్ల‌స్ అయ్యింది. దాంతో నయనతార కెరీర్ యు టర్న్ తీసుకుని సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి నాంది పలికింది. ఆ తర్వాత తమిళంలో వరుస ఆఫర్లతో లేడీ సూప‌ర్ స్టార్ అయిపోయింది న‌య‌న్‌. అయితే తెలుగులో మాత్రం శ్రీరామరాజ్యం' తర్వాత కృష్ణం వందే జగద్గురుం', గ్రీకువీరుడు', అనామిక', బాబు బంగారం' వంటి సినిమాల్లో నటించినా.. మళ్ళీ అంతటి విజయాన్ని అందుకోలేకపోయిందీ భామ. ఇక ఏడేళ్ళ తర్వాత జై సింహా' సినిమాలో బాలకృష్ణ సరసన ముచ్చ‌ట‌గా మూడోసారి నటించి తెలుగులో మళ్ళీ విజయాన్ని సొంతం చేసుకుంది ఈ మలయాళీ ముద్దుగుమ్మ‌.

More News

వెంకీ త‌మ్ముడిగా రోహిత్‌?

సీనియ‌ర్ క‌థానాయ‌కుడు వెంక‌టేష్ హీరోగా తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే పూజా కార్య‌క్ర‌మాల‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్రం.. అతి త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది.

ముంబయికి వెళ్ళనున్న నాగ్, వర్మ

‘శివ’వంటి బ్లాక్ బస్టర్ చిత్రంతో సంచలనానికి తెరలేపిన ద్వయం కింగ్ నాగార్జున,దర్శకుడు రాంగోపాల్ వర్మ.

చ‌ర‌ణ్‌.. ఇద్ద‌రు అన్నయ్య‌లు

ఈ ఏడాది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న రెండు సినిమాలు విడుదల కానున్నాయి. సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన 'రంగస్థలం' మార్చి 30న విడుదల కానుండగా....ఇక ఇటీవల చిత్రీకరణ ప్రారంభించుకున్న‌ బోయపాటి శ్రీను సినిమాని కూడా ఈ ఏడాదిలోనే విజయదశమి సంద‌ర్భంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఫిలిం నగర్ దైవ సన్నిదానం చైర్మన్ గా డా.మోహన్ బాబు

ఫిలిం నగర్ దైవ సన్నిదానం చైర్మన్ పదవికి  డా. మోహన్ బాబు గారు నేడు ప్రమాణ స్వీకారం చేసారు.

మళ్ళీ నటిస్తానంటున్న బాపు బొమ్మ

దివ్యవాణి....తాను బాపుగారి బొమ్మ.... తెలుగు ప్రేక్షకులలో తనదైన ముద్రవేసుకుందీ ముద్దుగుమ్మ...