బన్నీతో మరోసారి..!
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’ రూపొందనున్న సంగతి తెలిసిందే. నిజానికి పరిస్థితులు బావుంటే ఎప్పుడో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావాల్సింది. కానీ కరోనా పరిస్థితుల కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడింది. ప్రస్తుతం పరిమితుల మేరకు షూటింగ్ జరుపుకోవడానికి సుక్కు అండ్ యూనిట్ ఆలోచిస్తుంది. అదే తరుణంలో యూనిట్‌ను స్పెషల్ క్వారంటైన్లో ఉంచి షూటింగ్ జరుపుకోవడానికి కూడా ప్లాన్ చేసుకుంటున్నారు.
పాన్ ఇండియా మూవీ కావడంతో సినిమా మార్కెట్‌ను పెంచడానికి సుకుమార్ ప్రారంభం నుండి ప్లానింగ్ చేస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా తమిళం, హిందీ నుండి నటీనటులను ఎంపిక చేసుకునే పనిలో ఉన్నారు సుకుమార్. తమిళంలో విజయ్ సేతుపతిని నటింప చేయాలని అనుకున్నాడు సుక్కు. కానీ విజయ్ సేతుపతి ఈ సినిమాను హోల్డ్‌లో ఉంచారు. దీంతో ఇప్పుడు సుకుమార్ తన స్థానంలో తమిళంతో బాగా టచ్ ఉన్న తెలుగు నటుడు ఆది పినిశెట్టిని నటింప చేయాలని అనుకుంటున్నాడు. గతంలో సుకుమార్ డైరెక్ట్ చేసిన రంగస్థలం సినిమాలో ఆది పినిశెట్టి కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అన్నీ అనుకున్నట్లు జరిగితే సుకుమార్ దర్శకత్వంలో ఆది పినిశెట్టి నటించే అవకాశం ఉంది. అలాగే సరైనోడు చిత్రంలోనూ ఆది పినిశెట్టి బన్నీకి విలన్‌గా నటించాడు. ఆ లెక్కలోనూ బన్నీ, ఆది పినిశెట్టి రెండోసారి కలిసి నటించినవారవుతారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com