మళ్ళీ కలిశారు..సీక్వెల్ కు రంగం సిద్ధమవుతుంది...
Send us your feedback to audioarticles@vaarta.com
విశాల్ కు తమిళంతో పాటు తెలుగులో కూడా మార్కెట్ తెచ్చిపెట్టిన చిత్రం పందెంకోడి. 2005లో విడుదలైన ఈ చిత్రం తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. పదేళ్ళ తర్వాత ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ చేయడానికి రంగం సిద్ధమైంది. విశాల్ ఈ సినిమాకు సీక్వెల్ చేస్తున్నట్టు ప్రకటించాడు. ఎప్పుడో ప్రారంభం కావాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది.ఈ నెలలో సెట్స్ లోకి వెళుతుందని అందరూ అనుకుంటున్న తరుణంలో సినిమా ఆగిపోయిందంటూ విశాల్ ప్రకటించాడు.
అయితే ఈ సినిమా ఆగిపోవడానికి డైరెక్టర్ లింగుస్వామియే కారణమనేలా ఇన్ డైరెక్ట్ గా మెసేజ్ చేయడం సంచనాలకు దారి తీసింది. బన్నితో సినిమా కారణంగానే లింగుస్వామి ఈ సీక్వెల్‌ను పక్కన పెట్టేశాడని వార్తలు వినిపించాయి. విశాల్ నిర్మాతల సంఘంలో కూడా లింగుస్వామి వల్ల తనకు నష్టం జరిగిందని కూడా పిర్యాదు చేశారు. అయితే కారణాలు తెలియడం లేదు కానీ ఇప్పుడు పందెంకోడి సీక్వెల్ మళ్ళీ ట్రాక్ ఎక్కనుంది. ఈ విషయాన్ని హీరో విశాల్ ప్రకటించాడు. లింగుస్వామి దర్శకత్వం చేయనున్నఈ సినిమాకు యువన్‌శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తుండగా, మది సినిమాటోగ్రఫీ చేస్తాడట. త్వరలోనే మరిన్ని విశేషాలు తెలియజేస్తాని విశాల్ అన్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com