మ‌హేష్ సినిమాలో మ‌రోసారి..

  • IndiaGlitz, [Wednesday,June 27 2018]

సూపర్ స్టార్ మహేష్ బాబు, ఉత్త‌రాది భామ‌ పూజా హెగ్డే జంటగా ఓ సినిమా రూపొందుతున్న‌ సంగ‌తి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి టాలీవుడ్ రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సి.అశ్వ‌నీద‌త్‌, దిల్ రాజు నిర్మాత‌లు. అమెరికా బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం.. ప్రస్తుతం డెహ్రాడున్‌లో తొలి షెడ్యూల్‌ను జ‌రుపుకుంటోంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా కోసం సంద‌ర్భానుసారం సాగే ఓ ప్ర‌త్యేక గీతాన్ని ప్లాన్ చేస్తోంద‌ట చిత్ర బృందం. సినిమా సెకండ్ హాఫ్‌లో వ‌చ్చే ఈ ఐటమ్ సాంగ్‌కు ఇప్పటికే ఓ మంచి మాస్ బీట్‌ను దేవిశ్రీ సమకూర్చినట్టు సమాచారం.

ఓ స్టార్ హీరోయిన్ నర్తించే ఈ పాటకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. .'పోకిరి', 'అతిథి', 'దూకుడు', 'బిజినెస్ మాన్', '1 నేనొక్కడినే', 'ఆగడు'.. ఇలా మహేష్ సినిమాల్లో దాదాపు ఐటమ్ సాంగ్స్ అన్నీ బాగా క్లిక్ అయ్యాయి. ఈ పాట కూడా అదే బాట‌లో వెళుతుందేమో చూడాలి.

More News

ఆస్కార్ ఆహ్వానం అందుకున్న భార‌తీయ తార‌లు...

ఆస్కార్ అవార్డుల‌ను ప్ర‌దానం చేసే ద అకాడ‌మీ ఆఫ్ మోష‌న్ పిక్చ‌ర్స్ అండ్ సైన్సెస్ సంస్థ కొత్తగా అవార్డులు ప్ర‌దానం చేయ‌డానికి 58 దేశాలు..

డ‌బ్బింగ్ చెప్పుకుంటున్న రాజ్ త‌రుణ్‌

'ఉయ్యాలా జంపాలా', 'సినిమా చూపిస్త మావ', 'కుమారి 21ఎఫ్' లాంటి  రొమాంటిక్ ఎంట‌ర్‌టైనర్‌ల‌తో హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్న యువ కథానాయకుడు రాజ్ తరుణ్.

'శైలజా రెడ్డి అల్లుడు' ఫ‌స్ట్ లుక్ డిటైల్స్‌

యువ కథానాయకుడు నాగ చైతన్య, కేరళ కుట్టి అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న సినిమా 'శైలజా రెడ్డి అల్లుడు' (ప్రచారంలో ఉన్న పేరు).

మహేష్ చిత్రంలో 'అల్లరి' నరేష్ పాత్రే పెద్ద ట్విస్ట్‌?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

400 థియేటర్స్‌ కు పైగా విడులదవుతున్న 'యుద్ధభూమి'

మోహన్‌లాల్‌ హీరోగా నటించిన మలయాళ చిత్రం '1971 బియాండ్‌ బార్డర్స్‌'. 1971లో భారత్‌'పాక్‌  సరిహద్దుల్లో జరిగిన వార్‌ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది.