మరోసారి అత్త పాత్రలో!!
Send us your feedback to audioarticles@vaarta.com
రీసెంట్గా `శైలజారెడ్డి అల్లుడు` చిత్రంలో నాగచైతన్యకు అత్తగా.. శైలజారెడ్డిగా నటించి మెప్పించిన రమ్యకృష్ణ మరోసారి అత్త పాత్రలో నటించనున్నారు. అయితే ఈసారి ఆమె తమిళంలో శింబు చిత్రంలో అత్తగా నటించబోతున్నారట. శింబు హీరోగా సుందర్.సి దర్శకత్వంలో అత్తారింటికి దారేది రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రంలో ముందుగా ఖుష్బూ అత్త పాత్రలో నటిస్తారని వార్తలు వినిపించినా.. తాజా సమాచారం ప్రకారం ఈచిత్రంలో రమ్యకృష్ణనే అత్త పాత్రలో నటింప చేయాలని దర్శక నిర్మాతలు భావించారట. ఈ చిత్రంలో మేఘా ఆకాశ్, క్యాథరిన్ థ్రెసాలు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments