మ‌రోసారి అత్త పాత్ర‌లో!!

  • IndiaGlitz, [Monday,October 08 2018]

రీసెంట్‌గా 'శైల‌జారెడ్డి అల్లుడు' చిత్రంలో నాగ‌చైత‌న్య‌కు అత్తగా.. శైల‌జారెడ్డిగా న‌టించి మెప్పించిన ర‌మ్య‌కృష్ణ మ‌రోసారి అత్త పాత్ర‌లో న‌టించ‌నున్నారు. అయితే ఈసారి ఆమె త‌మిళంలో శింబు చిత్రంలో అత్త‌గా న‌టించ‌బోతున్నార‌ట‌. శింబు హీరోగా సుంద‌ర్.సి ద‌ర్శ‌క‌త్వంలో అత్తారింటికి దారేది రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే.

ఈ చిత్రంలో ముందుగా ఖుష్బూ అత్త పాత్ర‌లో న‌టిస్తార‌ని వార్త‌లు వినిపించినా.. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈచిత్రంలో ర‌మ్య‌కృష్ణ‌నే అత్త పాత్ర‌లో న‌టింప చేయాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావించారట‌. ఈ చిత్రంలో మేఘా ఆకాశ్‌, క్యాథ‌రిన్ థ్రెసాలు హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.