మరోసారి రజనీకాంత్ సినిమాకు ..!
- IndiaGlitz, [Tuesday,January 29 2019]
సూపర్‌స్టార్ రజనీకాంత్.. ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్‌లో సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. రజనీకాంత్ రాజకీయ ఎంట్రీని బేస్ చేసుకుని ఈ సినిమా ఉంటుందని.. ఈ చిత్రానికి నార్కాలి అనే టైటిల్ అనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను దర్శకుడు మురుగదాస్ ఖండించారు. తాజాగా రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడని వార్తలు వినపడుతున్నాయి.
ఈ చిత్రంలో రజనీకాంత్ జోడిగా కీర్తిసురేష్‌ను నటింప చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఒకవేళ రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్‌గా నటించేది నిజమే అయితే దశాబ్దకాలం తర్వాత రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్‌గా నటించే చిత్రమిదే అవుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించబోతున్నారట. 'పేట'లో అనిరుధ్ అందించిన మ్యూజిక్‌కు వచ్చిన రెస్పాన్స్ కారణంగానే రజనీకాంత్ తదుపరి సినిమాకు కూడా అనిరుధ్ అవకాశం దక్కించుకున్నాడని కోలీవుడ్ వర్గాల సమాచారం.