టాలీవుడ్ వివాదం : సి కళ్యాణ్ మరో ఆసక్తికర విషయం!

  • IndiaGlitz, [Friday,May 29 2020]

సీనియర్ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. ఇవాళ కరోనా క్రైసిస్ చారిటీకి సంబంధించిన సభ్యులు.. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రెండో విడతలో సినీ కార్మికులు చేయాల్సిన సాయం విషయంపై చర్చించడంతో పాటు .. బాలయ్య వ్యాఖ్యలపై చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ భేటీ అనంతరం పలువురు మీడియాతో మాట్లాడి కొన్ని కొన్ని కొత్త విషయాలు.. ఆసక్తికర అంశాలు, సీక్రెట్స్ చెప్పారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పినట్లే మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున టాలీవుడ్ వ్యవహారాలను లీడ్ చేస్తున్నారని ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ మీడియా ముఖంగా వెల్లడించారు. వాస్తవానికి ఇప్పటి వరకూ జరిగిన ప్రతి విషయంలోనూ చిరు, నాగ్ ఇద్దరూ కలిసి అడుగులేశారు కానీ.. సీఎం వీరిద్దర్నీ లీడ్ తీసుకోవాలని చెప్పిన విషయం ఎక్కడా బయటికి రాలేదు. తాజాగా ఈ విషయాన్ని నిర్మాత చెప్పారు. అందుకే వాళ్లు ఇవాళ కూడా సమావేశానికి వచ్చారని ఆయన అన్నారు. అసలు బాలయ్య రియల్ ఎస్టేట్ అనే పదం ఎందుకు వాడారో అర్థం కావట్లేదన్నారు. నిర్మాతలు, దర్శకులు మాట్లాడుకునే సమావేశాలు జరిగాయన్నారు.

More News

KCRకు కొత్త అర్థం చెప్పిన KTR!

తెలంగాణ నీటి పారుదల రంగంలో మరో అపురూప ఘట్టం చోటుచేసుకున్న విషయం విదితమే. గోదావరి జలాలు సముద్ర మట్టానికి 530 మీటర్ల ఎత్తున ఉన్న కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుకు చేరుకున్నాయి.

లాక్‌డౌన్ 5.0 : జూన్ 14 వరకు పెంపు యోచన!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఉధృతి ఇండియాలో ఇంకా తగ్గలేదు. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయే తప్ప అస్సలు తగ్గట్లేదు.

వలస కూలీల దయనీయ పరిస్థితిపై హరీశ్ ఆవేదన!

కరోనా మహమ్మారి కాటేస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్‌‌తో  వలస కార్మికులు వేల కిలోమీటర్లు నడిచి వెళ్తున్నట్లు టీవీలు, పేపర్లు, సోషల్ మీడియాలో

తెలంగాణ రైతులకు త్వరలోనే కేసీఆర్ తీపికబురు

తెలంగాణ రైతులకు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెబుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. దేశం కూడా ఆశ్చర్యపోయేలా ఆ విషయం చెబుతామన్నారు.

వ‌ర్మ ‘క్లైమాక్స్‌’ విడుద‌ల‌కు సిద్ధం

క‌రోనా దెబ్బ‌కు సినీ ఇండ‌స్ట్రీ కుదేలైంది. సినిమా థియేట‌ర్స్ మూతప‌డ్డాయి. ఎప్పుడు తెరుచుకుంటాయ‌నే దానిపై క్లారిటీ లేదు. అలాగే సినిమా షూటింగ్స్ కూడా ఆగిపోయాయి.