రవితేజకు జోడిగా మరోసారి
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ మహారాజా రవితేజ హీరోగా `RX100` ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఈ చిత్రానికి `మహా సముద్రం` అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు కూడా వచ్చాయి. కాగా ఈ సినిమాలో అదితిరావు హైదరి హీరోయిన్‌గా ఎంపికైందని వార్తలు వినిపించాయి. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం ఇప్పుడు రాశీఖన్నా నటించనుందని అంటున్నారు. ఇది వరకే రవితేజ, రాశీఖన్నా కలిసి `బెంగాల్ టైగల్`, `టచ్ చేసి చూడు` సినిమాల్లో జోడిగా నటించారు. ఇప్పుడు అంతా అనుకున్నట్లు జరిగితే ఈ జోడి మూడోసారి తెరపై సందడి చేస్తుందని టాక్. డిసెంబర్ నుండి ఈ సినిమా ప్రారంభమవుతుందని, రిలీజ్ వచ్చే ఏడాదిలోనేనని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments