రవితేజకు జోడిగా మరోసారి
- IndiaGlitz, [Wednesday,August 14 2019]
మాస్ మహారాజా రవితేజ హీరోగా 'RX100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఈ చిత్రానికి 'మహా సముద్రం' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు కూడా వచ్చాయి. కాగా ఈ సినిమాలో అదితిరావు హైదరి హీరోయిన్‌గా ఎంపికైందని వార్తలు వినిపించాయి. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం ఇప్పుడు రాశీఖన్నా నటించనుందని అంటున్నారు. ఇది వరకే రవితేజ, రాశీఖన్నా కలిసి 'బెంగాల్ టైగల్', 'టచ్ చేసి చూడు' సినిమాల్లో జోడిగా నటించారు. ఇప్పుడు అంతా అనుకున్నట్లు జరిగితే ఈ జోడి మూడోసారి తెరపై సందడి చేస్తుందని టాక్. డిసెంబర్ నుండి ఈ సినిమా ప్రారంభమవుతుందని, రిలీజ్ వచ్చే ఏడాదిలోనేనని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం.