నితిన్‌కు జోడీగా మరోసారి..
Send us your feedback to audioarticles@vaarta.com
యువ కథానాయకుడు నితిన్.. ప్రస్తుతం శ్రీనివాస కళ్యాణం చిత్రంతో బిజీగా ఉన్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శతమానం భవతి ఫేమ్ సతీష్ వేగేశ్న తెరకెక్కిస్తున్నారు. రాశి ఖన్నా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ఆగస్టులో విడుదల కానుంది.
ఈ సినిమా తరువాత.. ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో సినిమా చేయనున్నారు నితిన్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీష్మ - సింగిల్ ఫరెవర్ అనే టైటిల్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో కథానాయికగా హన్సికను ఎంపికచేసినట్లు తెలుస్తోంది.
ఇదివరకు నితిన్, హన్సిక కాంబినేషన్‌లో సీతారాముల కళ్యాణం లంకలో అనే చిత్రం వచ్చింది. ఆ తరువాత మళ్ళీ కలిసి నటించలేదు. త్వరలోనే హన్సిక ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. గతేడాది విడుదలైన గోపీచంద్ చిత్రం గౌతమ్ నంద తరువాత హన్సిక మళ్ళీ తెలుగు సినిమా చేయనేలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com