మ‌హేష్‌కు తండ్రిగా మ‌రోసారి..

  • IndiaGlitz, [Thursday,June 21 2018]

సూపర్ స్టార్ మహేష్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న‌ 25వ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో మహేష్‌కు జంటగా ఉత్తరాది భామ పూజా హెగ్డే నటిస్తోంది. ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత అశ్వనీదత్, సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ ‘దిల్’ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అమెరికా బ్యాక్ డ్రాప్‌లో సాగే ఈ చిత్రంలో ‘అల్లరి’ నరేష్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా డెహ్రాడున్‌లో ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను ప్రారంభించారు. ఈ షెడ్యూల్‌లో ప్రధాన పాత్రలకి సంబంధించి కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

ఇకపోతే.. తన సినిమాల్లో ప్రకాష్ రాజ్‌కు ఒక పాత్ర ఉండేట్టు చూసుకుంటాననీ.. దాని వలన ఆ పాత్ర ప్రత్యేకత పెరుగుతుందనీ.. ఇటీవల మహేష్ వెల్లడించిన విషయం తెలిసిందే. అందుకే మహేష్ సినిమాల్లో ప్రకాష్ రాజ్ దాదాపు కనిపిస్తూ ఉంటారు. అలాగే.. ఇప్పుడు ఈ సినిమాలో కూడా మహేష్ తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించనున్నారు. కథానుసారం ఎంతో ప్రాముఖ్యత కలిగే ఈ పాత్రలో చాలా ఇంటెన్సిటీ ఉంటుందట.

గతంలో మహేష్, ప్రకాష్ రాజ్ తండ్రీ కొడుకులుగా నటించిన ‘దూకుడు’, ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఇప్పుడు మ‌రోసారి తండ్రీ కొడుకులుగా కనిపిస్తున్న ఈ ద్వయం ఈ చిత్రంతో మ‌రో విజయాన్ని అందుకుంటారేమో చూడాలి.

More News

తోడ‌ల్లుళ్ళు పాత్ర‌ల్లో వెంకీ, వ‌రుణ్‌?

'పటాస్', 'సుప్రీమ్', 'రాజా ది గ్రేట్' లాంటి సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్న యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.

జూన్‌ 21న 'తేజ్‌ ఐ లవ్‌ యు' సాంగ్‌ ప్రోమో విడుదల

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎ.కరుణాకరన్‌ దర్శకత్వం

ఈ నెల 29న 'నా లవ్ స్టోరి'

అశ్వని క్రియేషన్స్ బ్యానర్ పై జి. లక్ష్మి నిర్మాతగా, శివగంగాధర్ దర్శకత్వంలో మహిధర్ , సోనాక్షి సింగ్ రావత్ లను వెండితెరకు పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం 'నా లవ్ స్టోరీ'.

'ఐపీసీ సెక్షన్ భార్యాబంధు' అన్ని సెక్షన్స్ ఆడియన్స్ కీ నచ్చుతుంది - ఆలూరి సాంబశివరావు

ఆయన మొదట కెమెరామెన్ కావాలని కలలు కన్నారు. కుదరలేదు. దాంతో తనే సొంతంగా సినిమా నిర్మించే స్థాయికి ఎదగాలని డిసైడ్ అయి.. కొన్నాళ్ళు  కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేసి, తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ చేసి

అభిమన్యుడు చాలా నచ్చింది - నితిన్

మాస్ హీరో విశాల్ హీరో గా సమంత, యాక్షన్ కింగ్ అర్జున్ ముఖ్య పాత్రల్లో పి.ఎస్. మిత్రన్ ని దర్శకునిగా పరిచయం చేస్తూ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ, హరి వెంకటేశ్వర పిక్చర్స్