మహేష్‌కు తండ్రిగా మరోసారి..
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న 25వ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మహేష్‌కు జంటగా ఉత్తరాది భామ పూజా హెగ్డే నటిస్తోంది. ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత అశ్వనీదత్, సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ ‘దిల్’ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అమెరికా బ్యాక్ డ్రాప్‌లో సాగే ఈ చిత్రంలో ‘అల్లరి’ నరేష్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా డెహ్రాడున్‌లో ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను ప్రారంభించారు. ఈ షెడ్యూల్‌లో ప్రధాన పాత్రలకి సంబంధించి కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
ఇకపోతే.. తన సినిమాల్లో ప్రకాష్ రాజ్‌కు ఒక పాత్ర ఉండేట్టు చూసుకుంటాననీ.. దాని వలన ఆ పాత్ర ప్రత్యేకత పెరుగుతుందనీ.. ఇటీవల మహేష్ వెల్లడించిన విషయం తెలిసిందే. అందుకే మహేష్ సినిమాల్లో ప్రకాష్ రాజ్ దాదాపు కనిపిస్తూ ఉంటారు. అలాగే.. ఇప్పుడు ఈ సినిమాలో కూడా మహేష్ తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించనున్నారు. కథానుసారం ఎంతో ప్రాముఖ్యత కలిగే ఈ పాత్రలో చాలా ఇంటెన్సిటీ ఉంటుందట.
గతంలో మహేష్, ప్రకాష్ రాజ్ తండ్రీ కొడుకులుగా నటించిన ‘దూకుడు’, ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఇప్పుడు మరోసారి తండ్రీ కొడుకులుగా కనిపిస్తున్న ఈ ద్వయం ఈ చిత్రంతో మరో విజయాన్ని అందుకుంటారేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com