మరోసారి పొలిటీషియన్ గా....
Send us your feedback to audioarticles@vaarta.com
ఖైదీ నంబర్ 150వ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేయకుండా బయటకు వచ్చేసిన హీరోయిన్ క్యాథరిన్..ఇప్పుడు రానా, తేజ కాంబినేషన్‌లో రూపొందుతోన్న సినిమాపై కాన్‌సన్‌ట్రేషన్ పెట్టింది. ఆసక్తికరమైన విషయమేమంటే ఈ చిత్రంలో ధనవంతురాలైన పొలిటీషియన్‌గా నటిస్తుందట. ఈ ఏడాది బన్ని, క్యాథరిన్ కాంబినేషన్‌లో బోయపాటి రూపొందించిన సరైనోడు చిత్రంలో కూడా క్యాథరిన్ ఎమ్మెల్యేగా నటించిన సంగతి తెలిసిందే. సరైనోడు కమర్షియల్ ఎంటర్‌టైనర్ అయితే తేజ, రానా సినిమా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోందని టాక్. ఈ సినిమాకు నేనే రాజు-నేనే మంత్రి అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. కాజల్ అగర్వాల్, నవదీప్‌లు కూడా ఈ సినిమా నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments