డైరెక్టర్‌గా మరోసారి..!
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోయిన్ కంగనా రనౌత్ నటించిన 'మణికర్ణిక... ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ' జనవరి 25న విడుదల కాబోతోంది. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలై అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఈ సినిమా తర్వాత కంగనా 'పంగా' అనే సినిమాలో కబడ్డీ ప్లేయర్‌గా నటించనుంది.
ఈ సినిమాకి అశ్వనీ అయ్యర్ దర్శకురాలు. ఈ సినిమా తర్వాత కంగనా చేయబోయే సినిమా ఏమిటనేది సినీవర్గాల ప్రశ్న. అయితే ఆమె తదుపరి సినిమా లవ్‌స్టోరీ అని తెలుస్తోంది. ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ కంగనా కోసం కథ రెడీ చేస్తున్నారట.
ఈ సినిమా కోసం కంగనా మెగాఫోన్ పట్టబోతోందని వార్తలు వస్తున్నాయి. ‘మణికర్ణిక’ చిత్రానికి క్రిష్ జాగ్లమూడితోపాటు కంగనా కూడా దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే ..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments