మ‌ళ్లీ ఐదేళ్ల త‌రువాత‌..

  • IndiaGlitz, [Tuesday,November 07 2017]

2013లో మూడు చిత్రాల‌తో సంద‌డి చేశారు సీనియ‌ర్ క‌థానాయ‌కుడు వెంక‌టేష్‌. వాటిలో రెండు చిత్రాలు మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలు (సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, మ‌సాలా) కాగా.. మ‌రొక‌టి సోలో హీరో మూవీ (షాడో). ఆ త‌రువాత మాత్రం ఏడాదికో సినిమా అన్న‌ట్లుగా వెంకీ సినిమాలు వ‌చ్చాయి. అయితే.. మ‌ళ్లీ ఐదేళ్ల త‌రువాత వెంకీ క‌థానాయ‌కుడిగా మూడు చిత్రాలు వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. విశేష‌మేమిటంటే.. వీటిలో కూడా రెండు మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు ఉండొచ్చ‌ని తెలిసింది.

కాస్త వివ‌రాల్లోకి వెళితే.. తేజ ద‌ర్శ‌క‌త్వంలో త‌న త‌దుప‌రి చిత్రాన్ని చేయ‌నున్న వెంక‌టేష్‌.. ఆ సినిమాతో పాటు అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం.. క‌ళ్యాణ్ కృష్ణ డైరెక్ష‌న్‌లో ఇంకో మూవీ చేయ‌నున్నాడు. ఈ రెండు కూడా మ‌ల్టీస్టార‌ర్ మూవీలే కావ‌డం విశేషం. అనిల్ రావిపూడి చిత్రంలో మ‌రో హీరో ఎవ‌రో క‌న్‌ఫ‌ర్మ్ కాలేదు.. కానీ టైటిల్ మాత్రం ఎఫ్ 2 (ఫ‌న్ అండ్ ఫ్ర‌స్ట్రేష‌న్‌) అని వినిపిస్తోంది.

ఇక క‌ళ్యాణ్ కృష్ణ చిత్రంలో వెంకీతో పాటు నాగ‌చైత‌న్య కూడా న‌టించ‌నున్నాడు. మేన‌మామ‌, మేన‌ల్లుడు అనుబంధం నేప‌థ్యంలో ఈ సినిమా ఉంటుంది. మొత్తానికి 2013 త‌రువాత 2018లో వెంకీ ముచ్చ‌ట‌గా మూడు సినిమాల‌తో సంద‌డి చేయ‌నుండ‌డం ఆయ‌న అభిమానుల‌కు ఆనందాన్నిచ్చే విష‌య‌మే.