మరోసారి తల్లికి బిడ్డగా నటిస్తుంది...
- IndiaGlitz, [Thursday,May 18 2017]
ఒకప్పుడు హీరోయిన్స్ అంటే హీరో పక్కన గ్లామర్‌తో పాటు పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్‌కు ప్రాధాన్యత ఇచ్చేవారు. మధ్యలో హీరోయిన్స్ కేవలం గ్లామర్ పాత్రలకే పరిమతమయ్యారు. కానీ ఇప్పటి ట్రెండ్ హీరోయిన్స్ గ్లామర్‌తో పాటు, పెర్ఫార్మెన్స్కు ప్రాధాన్యత ఇస్తూ విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటున్నారు.
అనుష్క, నయనతార, త్రిష, శ్రేయా శరన్ వంటి హీరోయిన్స్ ఇందులో ముందున్నారు. ఇది వరకు మాయ చిత్రంలో ఓ పాపకు అమ్మగా కనిపించిన నయనతార ఇమైక నొడిగల్ అనే చిత్రంలో మరోసారి ఓ పాపకు తల్లిగా కనిపించనుందట ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్ విలన్‌గా నటిస్తుండటం విశేషం.