ఈసారి కూడా రీమేక్ సినిమాయేనా..
Send us your feedback to audioarticles@vaarta.com
పవన్ కల్యాణ్ రాజకీయాల్లో బిజీ కానుండటంతో చేతిలోని సినిమాలను త్వర త్వరగా పూర్తి చేసేస్తున్నాడు. ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎ.ఎం.రత్నం సినిమా చేస్తాడట. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అవుతుంది. అయితే ఈ కాంబినేషన్లో రానున్న సినిమా రీమేక్ సినిమా కావడం గమనార్హం.
తమిళంలో విజయ్ హీరోగా నటించి థెరి(తెలుగులో పోలీస్) సినిమాను మళ్ళీ తెలుగులో రీమేక్ చేయనున్నారు. పవన్ గత చిత్రం కాటమరాయడు కూడా రీమేక్. బాక్సాఫీస్ వద్ద ఆశించన ఫలితం తెచ్చుకోలేదు. మరిప్పుడు మళ్ళీ రీమేక్..అది కూడా తెలుగులో విడుదలైన సినిమానే రీమేక్ చేయడం ఎందుకో అర్థం కావడం లేదు..అభిమానులు ఆలోచనలో పడ్డారు..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout