తలైవా పుట్టినరోజున
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న విజువల్ వండర్ '2.0'. ఈ హిట్ కాంబినేషన్లో రూపొందిన 'రోబో' చిత్రానికి ఇది సీక్వెల్. బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ విలన్‌గా నటిస్తున్నాడు. ఎమీ జాక్సన్ లేడీ రోబో పాత్రలో నటిస్తుంది. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. 450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 25న విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
నిజానికి ఈ సినిమాను దీపావళి సందర్భంగా విడుదల చేయాలనుకున్నారు కానీ గ్రాఫిక్స్ కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. దీంతో అభిమానులు కాస్తా నిరుత్సాహ పడ్డారు. దీంతో నిర్మాతలు అభిమానులను ఉత్సాహపరచడానికి రజనీకాంత్ పుట్టినరోజు, డిసెంబర్ 12న థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయాలనుకుంటున్నారని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com