ఫిదా విడుద‌లైన రోజునే..

  • IndiaGlitz, [Friday,May 11 2018]

ఫిదా.. గ‌తేడాది సంచ‌ల‌న విజ‌యం సాధించిన చిత్ర‌మిది. వ‌రుణ్ తేజ్‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన ఈ సినిమా.. ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల‌కు చాన్నాళ్ళ త‌రువాత మంచి విజ‌యాన్ని అందించింది. అంతేగాకుండా, నిర్మాత దిల్ రాజుకి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. అందుకే.. ఈ సినిమా విడుద‌ల తేదినే త‌న మ‌రో సినిమాకి కూడా దిల్ రాజు ఫిక్స్ చేసుకున్న‌ట్లు స‌మాచారం.

కాస్త వివ‌రాల్లోకి వెళితే.. నితిన్, రాశి ఖ‌న్నా, నందితా శ్వేత హీరోహీరోయిన్లుగా శ‌త‌మానంభ‌వ‌తి ఫేమ్ స‌తీష్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ‌నివాస క‌ళ్యాణం పేరుతో దిల్ రాజు ఓ సినిమాని రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే. శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జరుపుకుంటున్న ఈ సినిమాని జూలైలో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లుగా గ‌త కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఫిదా విడుద‌ల తేది అయిన జూలై 21నే శ్రీ‌నివాస క‌ళ్యాణంని కూడా విడుద‌ల చేయాల‌ని దిల్ రాజు భావిస్తున్నార‌ట‌. త్వ‌ర‌లోనే విడుద‌ల తేదిపై క్లారిటీ వ‌స్తుంది.