ఓంకార్ త‌దుప‌రి చిత్రం ఫిక్స్

  • IndiaGlitz, [Tuesday,October 27 2015]

జీనియ‌స్ సినిమాతో ద‌ర్శ‌కుడిగా పరిచ‌య‌మైన యాంక‌ర్ ట‌ర్న‌డ్ డైరెక్ట‌ర్ ఓంకార్. జీనియ‌స్ సినిమా విజ‌యం అందించ‌క‌పోయినా...తాజాగా తీసిన రాజు గారి గ‌ది మాత్రం ఓంకార్ కి మంచి విజ‌యాన్ని అందించింది. ద‌స‌రా రోజు రిలీజైన రాజు గారి గ‌ది అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటూ డిస్ర్టిబ్యూట‌ర్స్ కి మంచి లాభాల‌ను అందిస్తుంది. ఈ చిత్రం పై ఉన్న న‌మ్మ‌కంతో వారాహి చ‌ల‌న‌చిత్ర సాయి కొర్ర‌పాటి, ఎకె ఎంట‌ర్ టైన్మెంట్ అధినేత అనిల్ సుంక‌ర రాజు గారి గ‌ది సినిమాని రిలీజ్ చేసారు.

ఇదిలా ఉంటే.. ఓంకార్ తదుప‌రి చిత్రం కోసం రెండు విభిన్న‌మైన క‌థ‌ల‌ను సిద్దం చేసారు. రాజు గారి గ‌ది ని రిలీజ్ చేసిన అనిల్ సుంక‌ర ఎకె ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ లోనే ఓంకార్ నెక్ట్స్ మూవీ చేయ‌నున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం క‌ధాచ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే ఈ మూవీని ఎనౌన్స్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.