ఒమిక్రాన్ దెబ్బ గట్టిగానే: మహారాష్ట్రలో ఆంక్షలు.. తెలుగు ఇండస్ట్రీలో గుబులు
Send us your feedback to audioarticles@vaarta.com
దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మనదేశంలోనూ క్రమంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఒమిక్రాన్ కట్టడికి చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. మరీ ముఖ్యంగా మహారాష్ట్రలో దీని తీవ్రత ఎక్కువగా వుంది. అటు సాధారణ కరోనా కేసులు కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఉద్ధవ్ సర్కార్ ఆంక్షలు విధించింది.
రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 వరకు బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమికూడరాదని చెప్పింది. అలాగే పెళ్లిళ్లు ఇతర శుభాకార్యాలకు సైతం పరిమితి విధించింది. ఇండోర్ లో జరిగే పెళ్లిళ్లకు 100, ఔట్ డోర్ లో జరిగే పెళ్లిళ్లకు 250 మంది కంటే ఎక్కువ మంది హాజరుకావొద్దని ఆదేశించింది. ఇక జిమ్స్, స్పా, థియేటర్లు 50శాతం ఆక్యూపెన్సీతోనే నడిపించుకోవాలని మహారాష్ట్ర సర్కార్ స్పష్టం చేసింది.
అయితే ఒమిక్రాన్ తెలుగు సినీ ఇండస్ట్రీని భారీ దెబ్బ కొడుతోంది. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో కట్టడి చర్యలకు దిగుతున్నారు. అందులో భాగంగానే వివిధ రాష్ట్రాల్లో ఒమిక్రాన్ ఆంక్షలు అమలులోకి వచ్చాయి. మహారాష్ట్ర థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీకి అనుమతించడం... నైట్ కర్ఫ్యూతో రాత్రి షోలకు రెడ్ సిగ్నల్ పడింది. దీంతో ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ చిత్రయూనిట్‌లకు టెన్షన్ పట్టుకుంది. జనవరి 7న ఆర్ఆర్ఆర్, 14న రాధేశ్యామ్ రిలీజ్ డేట్ లాక్ చేసుకున్నాయి . 450 కోట్ల భారీ బడ్జెట్‌తో ఆర్ఆర్ఆర్ తెరకెక్కుతుండగా, 350 కోట్ల బడ్జెట్ తో రాధేశ్యామ్ రెడీ అయింది. ఇప్పుడు ఒమిక్రాన్ టెన్షన్ పెడుతుండంతో థియేటర్లు పూర్తిగా మూతపడితే భారీగా నష్టాలు తప్పవని నిర్మాతలకు దిగులు పట్టుకుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout