ఓ మై గాడ్: అవార్డ్ ఫంక్షన్లో నాగ్ పరువు తీసిన రేఖ..!
Send us your feedback to audioarticles@vaarta.com
టైటిల్ చూడగానే అవునా.. అంత పెద్ద ఇష్యూ ఏం జరిగిందబ్బా అని ఆశ్చర్యపోకండి.. అదేం లేదు ఇదంతా సరదా అంతే. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని జాతీయ పురస్కారాల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. 2018 సంవత్సరానికి శ్రీదేవి, 2019 సంవత్సరానికి రేఖకు అక్కినేని జాతీయ పురస్కారాలు అందుకున్నారు. ఈ క్రమంలో మొదట అందాల తార.. అప్పటికీ ఇప్పటికీ చెక్కు చెదరని అందంతో వెలుగుతున్న రేఖ గురించి నాగ్ మాట్లాడుతూ పలు విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలో ఆమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ మొదలుకుని చివరి సినిమా వరకూ అన్ని విషయాలు చెప్పారు. ఈ క్రమంలో రేఖ తొలి సినిమా ఫలానా అని చెప్పగా.. కాదు కాదు మీరు తప్పు తప్పుగా చెబుతున్నారంటూ మధ్యలో జోక్యం చేసుకుని అచ్చు తెలుగులో రేఖ మాట్లాడారు. అయితే ఆమె తెలుగు మాటలను లైవ్‌లో విన్న.. టీవీ చూస్తున్న ప్రేక్షకులు ఒకింత షాకయ్యారు. ఇంత స్పష్టంగా తెలుగు మాట్లాడుతున్నారేంటి..? అని ఆశ్చర్యపోయారు.!
కాగా.. ఈ సందర్భంగా నాగ్ శ్రీదేవి, రేఖలను ఆకాశానికెత్తేశారు. పూలరెక్కలు, కొన్ని తేనె చుక్కలు కలిపితే శ్రీదేవి అని.. శ్రీదేవికి బోనీకపూర్ భర్తగా లభించడం అదృష్టమన్నారు. ఏజ్ లెస్ బ్యూటీ రేఖ అని వ్యాఖ్యానించారు. అయితే నాగ్ మాట్లాడుతుండగానే ఆయనపై రేఖ పంచ్‌ల వర్షం కురిపించింది. అసలేంటి నాగ్ ఇది.. అవార్డు ఫంక్షనా లేక క్వశ్చన్ అండ్ అన్సర్స్ వేదికా..? అని రేఖ ప్రశ్నించింది.
అసలు రేఖ ఏమంది..!?
నాగ్ వేరే సినిమా పేరు చెప్పగా.. కాదు కాదు తాను నటించిన తొలి తెలుగు సినిమా ‘ఇంటిగుట్టు’ అని ఆమె చెప్పుకొచ్చింది. అయితే నాగ్ కాసింత హాస్యం పండించాలని అనుకున్నారేమో కానీ.. ఏదో అడగబోయి ఇంకేదో అడగ్గా సీన్ రివర్స్ అయ్యింది. దీంతో నాగ్‌కే రివర్స్ పంచ్ పడినట్లయ్యింది.
ఇదీ అసలు కథ..!
నాగ్: రేఖగారు మీరు ఇంత అందంగా ఎలా ఉన్నారు..?
రేఖ : మీరు ఎంత అందంగా ఉన్నారో నేను అంతే అందంగా ఉన్నాను. అని నాగ్ పరువు తీసింది.. రేఖ. అయితే ఏంటి నాగ్ అన్నీ తప్పుగా చెబుతున్నావ్ అని రేఖ అనగానే.. ‘ఓ మై గాండ్’ అంటూ నాగ్ నిట్టూర్చారు. శ్రీదేవితో కలిసి సినిమాలు చేశాను.. అవన్నీ గుర్తులేవా అని నాగ్‌కు రేఖ గుర్తు చేసే ప్రయత్నం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout