వామ్మో రాశీ... ఎంత నేర్చింది!

  • IndiaGlitz, [Monday,March 04 2019]

'భాష రాదు' అని హీరోయిన్లు ఇంగ్లిష్‌లో ముద్దుముద్దుగా చెప్ప‌డం నిన్న‌టి విష‌యం. ఇప్పుడు త‌రం మారింది. తార‌లంద‌రూ అన్ని భాష‌లూ నేర్చుకుంటున్నారు. మ‌రీ ముఖ్యంగా ర‌కుల్‌, రాశీ, త‌మ‌న్నా.. తెలుగు, త‌మిళ్ అన్నీ క‌ల‌గ‌లిపి మాట్లాడుతున్నారు. ఈ మ‌ధ్య నివేదా థామ‌స్ తెలుగు మాట్లాడుతుంటే తెలుగ‌మ్మాయిలైనా అంత స్ప‌ష్టంగా మాట్లాడ‌గ‌ల‌రా అని నోరెళ్ల‌బెట్టారు చుట్టూ ఉన్న‌వారు. ఇప్పుడు రాశీని చూసి త‌మిళ వాళ్ల ప‌రిస్థితి అదే మ‌రి.

ఆమె నాయిక‌గా ఓ సినిమా షూటింగ్ శివ‌రాత్రిని పుర‌స్క‌రించుకుని మొద‌లైంది. ఈ సినిమాకు విజ‌య్ చంద‌ర్ ద‌ర్శ‌కుడు. విజ‌య ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై రూపొందుతోంది. విజ‌య్ సేతుప‌తి హీరో. గ్రామీణ నేప‌థ్యంలో సాగే పూర్తి స్థాయి క‌మ‌ర్షియ‌ల్ సినిమా ఇది. ఈ సినిమా పూజా కార్య‌క్రమాలు సోమ‌వారం ఉద‌యం హైద‌రాబాద్‌లో జ‌రిగాయి. రాశీ ఖ‌న్నా మిన‌హా చిత్ర యూనిట్ అంతా హైద‌రాబాద్‌లో ఉంది. దీని గురించి రాశీ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు.

''నా త‌మిళ సినిమా ప్రారంభం రోజు నేను హైద‌రాబాద్లో లేను. ప్ర‌స్తుతం రాజ‌మండ్రిలో షూటింగ్‌లో ఉన్నా. అందుకే అక్క‌డికి రాలేక‌పోతున్నా. వారం రోజుల్లో త‌ప్ప‌కుండా ఆ సెట్లో ఉంటాను'' అని అన్నారు. ప్ర‌స్తుతం వెంకీ మామ షూటింగ్ రాజ‌మండ్రిలో జ‌రుగుతోంది. శ‌నివారం నుంచి ఆ సినిమా షూటింగ్ లో ఉన్న రాశీ వారం రోజుల్లో ఈ సినిమా సెట్‌కు వ‌చ్చేస్తార‌న్న‌మాట‌.

 

 

More News

'డిస్కోరాజా' సంద‌డి మొద‌లైంది. 

మాస్ మ‌హారాజా ర‌వితేజ మ‌రో ప‌వ‌ర్ ఫుల్ మాస్ అండ్ క్లాస్ సినిమాతో సినీ అభిమానులు ముందుకి రాబోతున్నారు. డిఫ‌రెంట్ కాన్సెప్ట్స్ ని  త‌న క‌థాంశాలుగా ఎంచుకుంటూ

పాక్ పేప‌ర్‌లో వ‌చ్చేస్తుంద‌ని క‌ల‌గంటానా..?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడిన యుద్ధం మాటలు పాక్ మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై పవన్ మాట్లాడుతూ.. "మీడియాలో నేను ఏదైనా మంచి మాట మాట్లాడితే చూపించ‌రు.

సీరియ‌ల్ నిర్మాత‌గా మారిన డైర‌క్ట‌ర్‌

క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ్‌లో సినిమాలు చేసిన టాప్ డైర‌క్ట‌ర్ ర‌మేష్ అర‌వింద్‌. క‌మ‌ల్‌హాస‌న్‌తో ప‌లు సినిమాలు చేసిన ర‌మేష్ అర‌వింద్ న‌టుడిగానూ సుప్ర‌సిద్ధుడు.

సిక్స్ ప్యాక్స్ చేస్తున్న విజ‌య్‌!

విజ‌య్ ఆంటోనీ ఇప్పుడు స్పీడ్ పెంచారు. రొటీన్ కేర‌క్ట‌ర్ల‌కు చెక్ పెట్టారు. గ‌త ఆరు నెల‌లుగా క‌ష్ట‌ప‌డి సిక్స్ ప్యాక్ చేశారు. తాజాగా డ్యాన్సు క్లాసుల‌కు వెళ్తున్నారు.

నాని 'జెర్సీ' వాయిదా ప‌డుతుందా?

కొన్ని సినిమాల మీద ప్రేక్ష‌కులే కాదు, హీరోలు కూడా అమాంతం ఆశ‌లు పెంచేసుకుంటుంటారు. నాని న‌టిస్తున్న 'జెర్సీ' సినిమా అలాంటిదే. ఇందులో క్రికెట‌ర్‌గా క‌నిపించ‌బోతున్నారు నాని.