వామ్మో రాశీ... ఎంత నేర్చింది!
Send us your feedback to audioarticles@vaarta.com
`భాష రాదు` అని హీరోయిన్లు ఇంగ్లిష్‌లో ముద్దుముద్దుగా చెప్పడం నిన్నటి విషయం. ఇప్పుడు తరం మారింది. తారలందరూ అన్ని భాషలూ నేర్చుకుంటున్నారు. మరీ ముఖ్యంగా రకుల్, రాశీ, తమన్నా.. తెలుగు, తమిళ్ అన్నీ కలగలిపి మాట్లాడుతున్నారు. ఈ మధ్య నివేదా థామస్ తెలుగు మాట్లాడుతుంటే తెలుగమ్మాయిలైనా అంత స్పష్టంగా మాట్లాడగలరా అని నోరెళ్లబెట్టారు చుట్టూ ఉన్నవారు. ఇప్పుడు రాశీని చూసి తమిళ వాళ్ల పరిస్థితి అదే మరి.
ఆమె నాయికగా ఓ సినిమా షూటింగ్ శివరాత్రిని పురస్కరించుకుని మొదలైంది. ఈ సినిమాకు విజయ్ చందర్ దర్శకుడు. విజయ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోంది. విజయ్ సేతుపతి హీరో. గ్రామీణ నేపథ్యంలో సాగే పూర్తి స్థాయి కమర్షియల్ సినిమా ఇది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు సోమవారం ఉదయం హైదరాబాద్‌లో జరిగాయి. రాశీ ఖన్నా మినహా చిత్ర యూనిట్ అంతా హైదరాబాద్‌లో ఉంది. దీని గురించి రాశీ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
``నా తమిళ సినిమా ప్రారంభం రోజు నేను హైదరాబాద్‌లో లేను. ప్రస్తుతం రాజమండ్రిలో షూటింగ్లో ఉన్నా. అందుకే అక్కడికి రాలేకపోతున్నా. వారం రోజుల్లో తప్పకుండా ఆ సెట్లో ఉంటాను`` అని అన్నారు. ప్రస్తుతం వెంకీ మామ షూటింగ్ రాజమండ్రిలో జరుగుతోంది. శనివారం నుంచి ఆ సినిమా షూటింగ్ లో ఉన్న రాశీ వారం రోజుల్లో ఈ సినిమా సెట్‌కు వచ్చేస్తారన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Iniya Vaishnavi
Contact at support@indiaglitz.com