Om Raut: శ్రీవారి ఆలయం ముందే కిస్సులు, హగ్గులు: వివాదంలో ఓం రౌత్, కృతి సనన్
Send us your feedback to audioarticles@vaarta.com
ఆదిపురుష్ టీమ్ వివాదంలో చిక్కుకుంది. ఏకంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్న తిరుమలలో చిత్ర యూనిట్‌లోని ఇద్దరు సభ్యులు అపచారం చేశారు. వారు కూడా దర్శకుడు ఓం రౌత్, హీరోయిన్ కృతి సనన్. వివరాల్లోకి వెళితే.. ఆదిపురుష్ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ మంగళవారం తిరుపతిలోని తారక రామా మైదానంలో జరిగింది. ఈ కార్యక్రమం ముగిశాక ఇక్కడే బస చేసిన కృతిసనన్, ఓం రౌత్‌లు బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి అర్చన సేవలో వీరు స్వామి వారి సేవలో పాల్గొన్నారు. వీరికి టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికి.. దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామి వారి తీర్ధప్రసాదాలు అందజేశారు.
గాలి గోపురం వద్ద అసభ్య ప్రవర్తన :
అంతా బాగానే వుంది కానీ.. ఆలయం గాలిగోపురం గుండా బయటకు వచ్చిన తర్వాత కృతి సనన్, ఓంరౌత్ చేసిన చేష్టలు భక్తులను చికాకుపెట్టాయి. శ్రీవారి దర్శనం పూర్తి చేసుకుని కారులో వెళ్లబోతున్న కృతి దగ్గరకు ఓం రౌత్ మళ్లి వచ్చి వీడ్కోలు పలికారు. అక్కడి వరకే అయితే ఏముండేది కాదు.. కానీ ఆయన కృతిని హగ్ చేసుకుని ఆమె చెంపపై ముద్దు ఇచ్చారు. మళ్లీ వెళ్తు వెళ్తూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదాస్పదమైంది. శ్రీవారి భక్తులు, ఆధ్యాత్మికవాదులు వీరిద్దరిపై మండిపడుతున్నారు.
తిరుమలలో ఎంతటివారైనా పద్ధతిగా వుండాల్సిందే :
చిత్ర పరిశ్రమలో పెక్, ఫ్లయింగ్ కిస్‌లు అనేవి సర్వ సాధారణమే అయినా.. తిరుమల వంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో అది కూడా ఆలయ ఆవరణలో ముద్దులు, హగ్‌లు వంటి చర్యలు సరైనది కాదని వారు ఫైర్ అవుతున్నారు. ఇది వీరిద్దరు కావాలని చేసినది కాకపోయినా.. ఆ ప్రాంతంలో ఇలాంటివి చేయడం మీడియాలో వైరల్ అయ్యింది. మరి ఈ వివాదానికి ఆదిపురుష్ టీమ్ ఎలాంటి ముగింపునిస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments