ఆ రోజే ఓం నమో వెంకటేశాయ ప్రారంభం
Wednesday, June 15, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
నవరస సమ్రాట్ నాగార్జున - దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్లో రూపొందిన అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడి సాయి చిత్రాలు అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణతో అథ్యాత్మిక అద్భుతాలుగా నిలిచాయి. అలాగే ఈ భక్తిరస చిత్రాలు నాగార్జున కెరీర్లోనే కాకుండా తెలుగు చలన చిత్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చిత్రాలుగా సంచలనం సృష్టించాయి. నాగార్జున, రాఘవేంద్రరావు, కీరవాణి...ఇలా ఈ చిత్రాలకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చాయి. ఈ మూడు భక్తిరస చిత్రాల స్పూర్తితో నాగార్జున, రాఘవేంద్రరావు మరో భక్తిరస చిత్రానికి శ్రీకారం చుట్టారు. అదే ఓం నమో వెంకటేశాయ.
వెంకటేశ్వర స్వామి భక్తుడు హాథీరామ్ బాబా జీవిత చరిత్ర ఆధారంగా రూపొందే ఈ భక్తిరస చిత్రానికి ఓం నమో వెంకటేశాయ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ టైటిల్ ఏమిటనేది అఫిషియల్ గా ఎనౌన్స్ చేయనున్నారు. శిరిడి సాయి చిత్రాన్ని నిర్మించిన మహేష్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. స్వరవాణి కీరవాణి సంగీత దర్శకత్వంలో ఇప్పటికే నాలుగు పాటలు రికార్డింగ్ జరుపుకున్నాయి. ఈ చిత్రంలో వెంకటేశ్వర స్వామి భార్యగా విమలారామన్ నటిస్తుంది. కంచె ఫేం విమలారామన్ కూడా ఓ ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే అందాల తార అనుష్క కూడా ఓ ముఖ్యపాత్ర పోషిస్తుంది. అయితే...అనుష్క సన్యాసినిగా నటిస్తుందని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఈనెల 29న ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడి సాయి..చిత్రాల వలే ఓం నమో వెంకటేశాయ చిత్రం కూడా అథ్యాత్మిక అద్భుత చిత్రంగా నిలుస్తుందని ఆశిద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments