ఓం నమో వెంకటేశాయ లేటెస్ట్ అప్ డేట్..
Tuesday, July 12, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
నవరస సమ్రాట్ నాగార్జున - దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్లో రూపొందుతున్న భక్తిరస చిత్రం ఓం నమో వెంకటేశాయ. ఈ చిత్రాన్ని శిరిడి సాయి చిత్ర నిర్మాత మహేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. హథీరామ్ బాబా జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 2 నుంచి అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో ప్రత్యేకంగా రూపొందించిన సెట్ లో షూటింగ్ జరుపుకుంటుంది.
ప్రస్తుతం నాగార్జున పై కీరవాణి పాడిన కీలకమైన సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ సాంగ్ పూర్తయిన తర్వాత అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లోనే రూపొందించిన మరో సెట్ లో షూటింగ్ చేయనున్నారు. ఈ షెడ్యూల్ ఈ నెలాఖరు వరకు ఉంటుంది. ఆతర్వాత ఆగష్టు 10 నుంచి పూణే సమీపంలోని ఓ ప్రాంతంలో ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ భక్తిరస చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments