శ్రీవారిని దర్శించుకున్న ఓం నమో వేంకటేశాయ టీమ్..!
Saturday, January 21, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
నవరస సమ్రాట్ నాగార్జున - దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్లో రూపొందుతున్న నాలుగవ భక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయ. ఈ చిత్రాన్ని సాయికృపా ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై మహేష్ రెడ్డి నిర్మించారు. స్వరవాణి కీరవాణి సంగీతం అందించిన ఓం నమో వేంకటేశాయ ఆడియోకు మంచి స్పందన లభిస్తుంది. ఇక ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున, అమల, రాఘవేంద్రరావు, మహేష్ రెడ్డి తదితరులు ఈరోజు తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దేవస్ధానం అధికారులు దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందచేసారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments