శ్రీవారిని దర్శించుకున్న ఓం నమో వేంకటేశాయ టీమ్..!

  • IndiaGlitz, [Saturday,January 21 2017]

న‌వ‌ర‌స స‌మ్రాట్ నాగార్జున - ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్లో రూపొందుతున్న నాలుగ‌వ భ‌క్తిర‌స చిత్రం ఓం న‌మో వేంక‌టేశాయ‌. ఈ చిత్రాన్ని సాయికృపా ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై మ‌హేష్ రెడ్డి నిర్మించారు. స్వ‌ర‌వాణి కీర‌వాణి సంగీతం అందించిన ఓం న‌మో వేంక‌టేశాయ ఆడియోకు మంచి స్పంద‌న ల‌భిస్తుంది. ఇక ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా అక్కినేని నాగార్జున‌, అమ‌ల‌, రాఘ‌వేంద్ర‌రావు, మ‌హేష్ రెడ్డి త‌దిత‌రులు ఈరోజు తిరుమ‌ల వెళ్లి శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. ఈరోజు ఉద‌యం వీఐపీ ప్రారంభ ద‌ర్శ‌న స‌మ‌యంలో శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. దేవ‌స్ధానం అధికారులు ద‌ర్శ‌నం అనంత‌రం తీర్థ ప్ర‌సాదాలు అంద‌చేసారు.